Begin typing your search above and press return to search.

ప్రేక్షకులను అనుష్క నిరాశపరచదంతే..!

ఐతే అనుష్క ఫ్యాన్స్ థియేటర్ లో ఎలాగు చూడలేకపోయారు ఓటీటీ లో అయినా చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఐతే ఘాటి సినిమా ఓటీటీలో చూసిన ఆడియన్స్ అనుష్క సూపర్ అనేస్తున్నారు.

By:  Ramesh Boddu   |   1 Oct 2025 4:00 PM IST
ప్రేక్షకులను అనుష్క నిరాశపరచదంతే..!
X

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత మరో రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఘాటి సినిమా చేసింది అనుష్క. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించారు. అనుష్క తో పాటు వెంకట్ ప్రభు కూడా సినిమాలో నటించారు. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతోనే సూపర్ హిట్లు కొట్టిన స్టామినా అనుష్కది. ఐతే ఆమె ఈమధ్య వరుస సినిమాలు చేయకపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ నమ్మకంతోనే క్రిష్ ఘాటి సినిమా తీశారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఘాటి డిజిటల్ రిలీజ్..

ఐతే సినిమా థియేట్రికల్ రిలీజ్ లో డిజాస్టర్ అయ్యింది. సినిమాను ఆడియన్స్ కి నచ్చేలా చేయడంలో క్రిష్ ఫెయిల్ అయ్యాడు. ఘాటి సినిమా లేటెస్ట్ గా ఓటీటీ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఘాటి డిజిటల్ రిలీజైంది. ఐతే అనుష్క ఫ్యాన్స్ థియేటర్ లో ఎలాగు చూడలేకపోయారు ఓటీటీ లో అయినా చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఐతే ఘాటి సినిమా ఓటీటీలో చూసిన ఆడియన్స్ అనుష్క సూపర్ అనేస్తున్నారు.

అనుష్క తన పోర్షన్ వరకు అదరగొట్టేసింది. ఈ సినిమా ఫెయిల్యూర్ పూర్తి బాధ్యత అంతా దర్శకుడిదే అనిపిస్తుంది. సినిమా చూసిన ఎవరైనా అదే చెబుతారు. ఎందుకంటే సినిమా కోసం అనుష్క చాలా ఎఫర్ట్ పెట్టింది. తన వరకు ది బెస్ట్ ఇచ్చింది. కానీ సినిమా కథ, కథనం ప్రేక్షకుడికి ఎంగేజ్ చేసేలా లేకుండా క్రిష్ ట్రాక్ తప్పాడు.

రానాతో చేసిన ఒక స్పెషల్ ఫోన్ టాక్..

ఈ సినిమా రిలీజ్ టైం లో అనుష్క ప్రమోషన్స్ కి రాకపోవడం కూడా ఫెయిల్యూర్ కి రీజన్ అన్నారు. ఘాటి సినిమా రిలీజ్ ముందు చిత్ర యూనిట్ ఎంత హంగామా చేసినా సినిమాను ఎవరు పట్టించుకోలేదు. అనుష్కతో ఒక వీడియో ప్రమోషన్ చేయించకపోవడం తో ఆడియన్స్ కి అది రీచ్ కాలేదు. ఐతే ఘాటి సినిమా ఓటీటీలో చూసిన ఆడియన్స్ మాత్రం అనుష్క వరకు బాగానే చేసింది కానీ డైరెక్టర్ మిగతా యాస్పెక్ట్స్ అన్ని ఫెయిల్ అయ్యాయని అంటున్నారు. అనుష్క ఈమధ్య సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది. ఘాటి కోసం రానాతో చేసిన ఒక స్పెషల్ ఫోన్ టాక్ లో భాగంగా నెక్స్ట్ ఇయర్ నుంచి వరుస సినిమాలు చేస్తానని అన్నది. ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా చేస్తున్న అనుష్క నెక్స్ట్ తెలుగు సినిమా ఏదవుతుందా అన్న ఆసక్తి ఆమె ఫ్యాన్స్ లో ఉంది.

స్టార్ హీరోలతో కూడా అనుష్క నటించే ఛాన్స్ ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఒకప్పుడు బాక్సాఫీస్ ని షేక్ చేసిన అనుష్క ఇప్పుడు పూర్తిగా ఫాం కోల్పోయిందని చెప్పొచ్చు.