అనుష్క ఒక్క పోస్ట్.. అటెన్షన్ వచ్చేసింది..!
ఘాటి సినిమా పూర్తి చేసిన అనుష్క ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనట్లేదన్న డిజప్పాయింట్ ఫ్యాన్స్ లో ఉంది.
By: Ramesh Boddu | 1 Sept 2025 3:30 PM ISTఘాటి సినిమా పూర్తి చేసిన అనుష్క ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనట్లేదన్న డిజప్పాయింట్ ఫ్యాన్స్ లో ఉంది. అనుష్క బయటకు రాకపోవడానికి ఒకటి కాదు చాలా రీజన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కోసం వస్తే అసలేమాత్రం సంబంధం లేని విషయాల గురించి ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాదు సినిమాల గ్యాప్ కి రీజన్, ఆమె లుక్స్ పై కామెంట్ ఇలా ప్రతి ఒక్కటి అనుష్క కు చాలా డిస్ కంఫర్ట్ ఫీలింగ్ తెప్పిస్తాయని తెలుస్తుంది. అందుకే అనుష్క సినిమా కోసం ఎంత కష్టమైన పడతా ఎన్ని రోజులైనా షూటింగ్ చేస్తా కానీ ప్రమోషన్స్ మాత్రం నా వల్ల కాదనేస్తుంది.
ప్రమోషన్స్ కోసం అనుష్క రాలేదని..
క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఘాటి సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అనుష్క రాలేదని అందరు అనుకుంటున్న ఇలాంటి టైం లో అనుష్క తన సోషల్ మీడియా ద్వారా ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. ఏ.ఐ తో చేసిన ఒక వీడియో అనుష్క దాకా వెళ్లింది. ఘాటి వస్తుంది అందరు అలర్ట్ అవ్వండంటూ అనుష్క ఫ్యాన్స్ దాన్ని రూపొందించారు. ఐతే దాన్ని అనుష్క తనని మళ్లీ నవ్వేలా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేసింది.
సో ఘాటి కోసం అనుష్క అలా ఒక పోస్ట్ పెట్టింది. ఐతే అనుష్క ఘాటి ప్రమోషన్స్ లో భాగంగా రానాతో ఒక ఆడియో చాట్ చేసింది. రానాతో సినిమాకు సంబందించిన విషయాలు పంచుకుంది. ఐతే వీడియో రూపంలో కాదు అది కేవలం ఆడియో ద్వారానే. ప్రస్తుతం అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అనుష్క AI వీడియో
అనుష్క ఘాటి కోసం చాలా రిస్క్ తీసుకుని మరీ నటించిందని క్రిష్ చెబుతున్నారు. ఈ సినిమాలో విక్రం ప్రభు కూడా నటించాడు. ఇంతకీ ఘాటి కోసం అనుష్క షేర్ చేసిన AI వీడియో ఏంటో తెలుసా.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
ఘాటి సినిమాను యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించారు. రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ అన్నిటిలో డైరెక్టర్ క్రిష్, జగపతి బాబు పాల్గొంటున్నారు. ఐతే కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి అందులోనూ అనుష్క ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్న ఫిమేల్ సెంట్రిక్ సినిమా కాబట్టి ఘాటి మీద మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి సినిమా ఆశించిన రేంజ్ సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
