Begin typing your search above and press return to search.

క్రిష్ 'ఘాటీ'.. అనుష్కకు పెద్ద దెబ్బే..

సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి రీసెంట్ గా ఘాటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   11 Sept 2025 8:00 AM IST
క్రిష్ ఘాటీ.. అనుష్కకు పెద్ద దెబ్బే..
X

సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి రీసెంట్ గా ఘాటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలోకి అనుష్క రాగా.. ఆ సినిమాను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మించారు.

అయితే రిలీజ్ కు ముందు ఘాటీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ట్రైలర్ తెగ మెప్పించింది. దీంతో కచ్చితంగా అనుష్కకు మరో హిట్ దక్కుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. సినిమాల మధ్య గ్యాప్ ఉంటున్నా.. సక్సెస్ ట్రాక్ లో ఉన్న సీనియర్ బ్యూటీకి ఖాతాలో మరో విజయం చేరుతుందని అనుకున్నారు.

కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయింది. ఘాటీ మూవీ అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకుంటే మినిమమ్ టాక్ అందుకోలేదు. రిలీజ్ కు ముందు ఏర్పడిన అంచనాలతో రూ.5 కోట్లు ఓపెనింగ్స్ వస్తాయని అంతా ఊహించగా.. తొలి మూడు రోజులు కలిపి కూడా అంత రాలేదు.

రూ.10 కోట్ల క్లబ్ లో కూడా చేరడం కష్టమేనని అంతా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు థియేట్రికల్ షేర్ బాగా తక్కువయిందని తెలుస్తోంది. బుక్ మై షో ట్రెండ్స్ లో కూడా కనిపించడం లేదు. దీంతో సినిమా డిజాస్టర్ వైపు మళ్లుతోంది. భారీ నష్టాలు వస్తాయని అర్థమవుతోంది. అదే సమయంలో అనుష్కకు ఘాటీ పెద్ద దెబ్బేసిందని చెప్పాలి.

ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మడు.. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. కొన్ని ప్లాఫులు అవ్వగా.. చాలా సినిమాలు హిట్స్ గా నిలిచాయి. అనుష్క స్టార్ హీరోయిన్ గా మార్చేశాయి. ముఖ్యంగా బాహుబలి-2తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఆమె సొంతమైంది. అందరి దృష్టి అమ్మడు చిత్రాలపై పడింది.

బాహుబలి-2 తర్వాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క.. ఆ తర్వాత భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాల్లో నటించారు. అందులో నిశబ్దం ఓటీటీలోకి రాగా.. మిగతా రెండు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ ఇప్పుడు ఆమె థియేట్రికల్ సక్సెస్ ట్రాక్ ను ఘాటీ దెబ్బేసింది. మరి ఫ్యూచర్ లో అనుష్క కమ్ బ్యాక్ ఇవ్వాలని అంతా కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.