Begin typing your search above and press return to search.

పుష్పరాజ్ తో శీలావతి.. ఆడియో కాల్ వైరల్!

ఇక ఆడియో కాల్ విషయానికి వస్తే..అనుష్కకు ఘాటీ రిలీజ్ సందర్భంగా బెస్ట్ విషెస్ చెప్పడమే కాకుండా.. నిన్ను స్వీటీ అని పిలవాలా లేక ఘాటీ అని పిలవాలా అంటూ అల్లు అర్జున్ అనుష్కను ఆటపట్టించారు.

By:  Madhu Reddy   |   4 Sept 2025 6:28 PM IST
పుష్పరాజ్ తో శీలావతి.. ఆడియో కాల్ వైరల్!
X

చాలా రోజుల తర్వాత అనుష్క మళ్ళీ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ఘాటీ. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సెప్టెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా వైడ్ విడుదల కాబోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో సరికొత్త పుంతలు తొక్కింది అనుష్క. అందులో భాగంగానే ఎక్కడా ప్రత్యక్షంగా ప్రమోషన్లలో పాల్గొనకుండా.. ఆడియో కాల్స్ ద్వారా మాట్లాడుతూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ముఖ్యంగా ఈ కొత్త ప్రయత్నం అటు జనాలలోకి కూడా వెళ్తోందని చెప్పవచ్చు.

ఇందులో భాగంగానే మొన్నటికి మొన్న దగ్గుబాటి రానాతో ఫోన్ కాల్ మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చిన అనుష్క.. ఆ తర్వాత ఎఫ్ఎం రేడియోతో కూడా సంభాషణ జరిపింది. ఇప్పుడు ఏకంగా పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ తో ఫోన్ కాల్ మాట్లాడింది. ఈ ఆడియోని యువి క్రియేషన్స్ బ్యానర్ వారు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.. ఈ ఆడియో ఫోన్ కాల్ లో చాలా జోవియల్ గా ఇద్దరూ మాట్లాడుతూ అటు శ్రోతలకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. అంతేకాదు వీరిద్దరూ మాట్లాడుతున్న తీరు వినే ఆడియన్స్ లో కూడా మరింత జోష్ కలిగించింది అని చెప్పవచ్చు.

ఇక ఆడియో కాల్ విషయానికి వస్తే..అనుష్కకు ఘాటీ రిలీజ్ సందర్భంగా బెస్ట్ విషెస్ చెప్పడమే కాకుండా.. నిన్ను స్వీటీ అని పిలవాలా లేక ఘాటీ అని పిలవాలా అంటూ అల్లు అర్జున్ అనుష్కను ఆటపట్టించారు. ఇంకా పుష్ప ఘాటీ క్రాస్ ఓవర్ టాక్ వస్తుంది. ఎక్కడ చూసినా పుష్ప గురించే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగు చాలా పాపులర్ అయిపోయింది అని అనుష్క అంటే.. దానికి తెగ సంబరపడిపోయారు అల్లు అర్జున్. ఆ తర్వాత.. ఇంత క్రేజ్ ఉన్న పుష్పతో శీలావతి కలిస్తే ఎలా ఉంటుందనే ఐడియా బాగుంది. సుకుమార్, క్రిష్ ను కలిసి ప్లాన్ చేయమని చెబుతాం అంటూ ఒక్కసారిగా హైప్ ఇచ్చారు.

రేపు సినిమా విడుదల కాబోతోంది కదా.. ఎలా ఫీలవుతున్నారు? అని అల్లు అర్జున్ ప్రశ్నించగా.. చాలా భయంగా ఉంది అంటూ అనుష్క తెలిపింది. అంతేకాదు వేదం సినిమాలో క్రిష్ తనకు ఇచ్చిన సరోజ పాత్ర గురించి కూడా గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జనరేషన్లో ఇంత యాక్షన్ పర్ఫామెన్స్ ఇచ్చే హీరోయిన్ మీరు ఒకరే.. రుద్రమదేవి, భాగమతి ఇప్పుడు శీలావతి అంటూ అనుష్క పై ప్రశంసల కురిపించారు అల్లు అర్జున్.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పుష్పరాజు శీలావతి ఫైట్ కి దిగితే ఎలా ఉంటుంది అని కొంతమంది అడిగారు. ఇక దీనిపై సుకుమార్ కి చెప్పమని అడిగాను అని అనుష్క చెబుతుంది. దీనికి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నిజమే కదా పుష్పరాజు వర్సెస్ శీలావతి అయితే ఎవరు డైరెక్ట్ చేయాలో మీరే చెప్పండి.. ఒక పని చేద్దాం రెండు పార్ట్స్ చేసి ఒకటి సుకుమార్ ఇంకొకటి క్రిష్ కి ఇద్దామంటూ సరదాగా కామెంట్లు చేసుకున్నారు. మొత్తానికైతే ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.