రానాతో అనుష్క ఫోన్ ముచ్చట్లు.. ఫైనల్ గా అది చెప్పేసింది..!
స్వీటీ అనుష్క ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇక మీదట అనుష్క వరుస సినిమాలు చేస్తుందట.
By: Ramesh Boddu | 1 Sept 2025 3:42 PM ISTస్వీటీ అనుష్క ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇక మీదట అనుష్క వరుస సినిమాలు చేస్తుందట. ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ నుంచి అనుష్క వరుసగా సినిమాలు చేస్తుందట. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు స్వయంగా అనుష్క తన మాటలతోనే చెప్పింది. సెప్టెంబర్ 5న ఘాటి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా పాల్గొనలేదు అనుష్క. ఐతే రానాతో అనుష్క ఫోన్ సంభాషణల్లో ఘాటి సినిమా ఎక్స్ పీరియన్స్ ని షేర్ చేసుకుంది. ఘాటి సినిమా చేయడం ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్ గా భావిస్తున్నా అని అనుష్క చెప్పింది.
పవర్ ఫుల్ రోల్ లో అనుష్క..
క్రిష్ అంతకుందు వేదం సినిమాలో సరోజ పాత్ర ఇచ్చారు.. ఇప్పుడు షీలా లాంటి పవర్ ఫుల్ రోల్ ఇచ్చారని అన్నారు అనుష్క. ఘాటిల లైఫ్ గురించి వాళ్ల ప్రపంచంలో జరిగే విషయాల గురించి ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని.. ఘాటిలుగా ఉన్న షీలా ఎలా పవర్ ఫుల్ ఉమెన్ గా మారిందే ఈ సినిమా కథ అని అన్నారు అనుష్క. ఐతే ఈ కథ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందని ఇది కరెక్ట్ టైం అని అన్నారు అనుష్క.
ఇక కత్తి పట్టి చేసే సినిమాలన్నిటికీ తననే ఎంపిక చేస్తున్నారని అనుష్క అనగా.. అలాంటి పాత్రలకు నువ్వు పర్ఫెక్ట్ అని రానా అన్నారు. ఇక సినిమాలు ఎక్కువ చేయట్లేదు. మళ్లీ ఎప్పుడు వరుసగా సినిమాలు చేసావ్ అని రానా అడిగితే.. దానికి సమాధానంగా అనుష్క ఇక మీదట వరుస సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. రానా అనుష్క ఫోన్ సంభాషణలు అనుష్క ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.
రానాతో ఘాటి సినిమా విషయాలు..
ఆఫ్టర్ లాంగ్ టైం అనుష్క నుంచి వచ్చిన ఈ ఆడియో చాట్ ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది. అనుష్క కెమెరా ముందుకొచ్చి ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అందుకే ఘాటి ప్రమోషన్స్ బాధ్యత అంతా కూడా డైరెక్టర్ క్రిష్ తన భుజాన వేసుకున్నారు. ఐతే అనుష్క లేటెస్ట్ గా ఘాటి గురించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక AI వీడియోని షేర్ చేసింది. అంతేకాదు రానాతో ఘాటి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చించారు.
ఈ డిస్కషన్ లో అనుష్క నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూగా సినిమాలు చేస్తా అని చెప్పం స్వీటీ ఫ్యాన్స్ కి సూపర్ జోష్ తెచ్చింది. మరి చెప్పినట్టు అనుష్క వరుస సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి.
