Begin typing your search above and press return to search.

బాలీవుడ్ నిర్మాతలకు చురకలంటించిన అనురాగ్ కశ్యప్!

ఆర్జీవీ శిష్యుడిగా దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టిన డైరెక్టర్ అనురాగ్ కష్యప్ బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.

By:  Madhu Reddy   |   17 Sept 2025 2:00 PM IST
బాలీవుడ్ నిర్మాతలకు చురకలంటించిన అనురాగ్ కశ్యప్!
X

ఆర్జీవీ శిష్యుడిగా దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టిన డైరెక్టర్ అనురాగ్ కష్యప్ బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే నిర్మాతగా కూడా రాణించారు. అయితే అలాంటి ఈ డైరెక్టర్ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీపై, నిర్మాతలపై, దర్శకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రతిసారి బాలీవుడ్ ని తక్కువ చేస్తూ నేను సౌత్ ఇండస్ట్రీకి వెళ్లిపోతాను అంటూ మాట్లాడారు. దీనికి తోడు ఇప్పుడు ముంబైని వదిలి బెంగళూరుకి చేరుకున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా తన కొత్త మూవీ నిషాంచి ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనురాగ్ కష్యప్ మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "బాలీవుడ్ లో ఉన్న నిర్మాతలు కొత్తరకం సినిమాలు తీయడానికి మొగ్గు చూపరు.కానీ సౌత్ లో ఏదైనా సినిమా వస్తే దాన్ని రీమేక్ చేయడానికి, దాన్ని అనుసరించి తీయడానికి మాత్రమే ముందుకు వస్తారు. రీసెంట్గా మలయాళంలో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా 'లోక చాప్టర్1: చంద్ర' (తెలుగులో కొత్త లోక) అంచనాలను మించి హిట్ అయింది.. ఇప్పటి వరకు మలయాళ ఇండస్ట్రీలో ఇంత పెద్ద హిట్ రాలేదు.ఈ సినిమాతో ఇండస్ట్రీకి మంచి హిట్ వచ్చింది.ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. కొత్త లోక సినిమా బాగా ఆడడానికి కారణం అక్కడి చిత్ర నిర్మాతలు సినిమాకి బాగా సహకరిస్తున్నారు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అలా ఉండదు. కొత్త లోక మూవీని బాలీవుడ్ ఇండస్ట్రీలో 10 కొత్త లోకలు తీసి మోసం చేస్తారు..

వాస్తవానికి చెప్పాలంటే బాలీవుడ్ నిర్మాతలకు తమ సినిమాలపై నమ్మకం ఉండదు.కానీ దక్షిణాది నిర్మాతలకు అలా ఉండదు. తమ సినిమాపై పూర్తి నమ్మకం పెట్టుకుంటారు.. బాలీవుడ్ నిర్మాతలు ఎక్కువగా తమ సినిమా పోస్టర్లను చూసే మురిసిపోతుంటారు. కానీ ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేస్తే అర్థమవుతుంది డెమన్ స్లేయర్ మూవీ ఎంత బాగా ఆడుతుందో. కానీ బాలీవుడ్ నిర్మాతలు దాన్ని పట్టించుకోరు. అసలు వారికి దాని గురించి కూడా తెలియదు.. వేరే ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ నిర్మాతలు చాలా తొందరగా అలాంటి సినిమా చేయడానికి చూస్తారు.వాళ్లు కేవలం సినిమా హిట్ అయిందా లేదా అనేది మాత్రమే చూస్తారు. కానీ ఆ సినిమాల గురించి పూర్తిగా వాళ్లకి తెలియదు.. సౌత్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఎంతోమంది యాక్షన్ తో నిండిన భారీ హిట్ లను నిర్మిస్తున్నారు " అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు..

ఏది ఏమైనా బాలీవుడ్ నిర్మాతలలో ఆలోచన ధోరణి పూర్తిగా తగ్గిపోయింది.. పక్క భాషా సినిమాను కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారు అంటూ బాలీవుడ్ నిర్మాతలకు చురకలు అంటించారు అనురాగ్ కశ్యప్. మరి దీనిపై బాలీవుడ్ నిర్మాతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.