Begin typing your search above and press return to search.

తెలివైన నిర్మాతలు ఎప్పుడూ ఇలా చేయ‌రు!

ఒకానొక ద‌శ‌లో `నేను సినిమాను వదిలేశాను` అంటూ ర‌ణ్ వీర్ సింగ్ కి మెసేజ్ పంపినందుకు తనను ఎలా తిట్టారో కూడా అనురాగ్ కశ్యప్ వెల్లడించాడు.

By:  Sivaji Kontham   |   3 Nov 2025 10:05 AM IST
తెలివైన నిర్మాతలు ఎప్పుడూ ఇలా చేయ‌రు!
X

నిజానికి ద‌ర్శ‌క ర‌చ‌యిత‌ లేదా క్రియేట‌ర్ ప‌నిలో ఇత‌రులు వేలు పెడితే ఏమ‌వుతుందో ఇది చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. ర‌ణ‌బీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా అనురాగ్ క‌శ్య‌ప్ తెర‌కెక్కించిన `బాంబే వెల్వెట్` ఆరోజుల్లోనే దాదాపు 90 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందింది. ఈ సినిమా నుంచి నిర్మాత‌లు చాలా ఆశించారు. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మైంది. చాలా సంద‌ర్భాల్లో త‌న ప‌నిలో ఇత‌రులు వేలు పెడితే ఎలా ఉంటుందో ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ త‌న అనుభ‌వ పాఠాల‌ను చెప్ప‌క‌నే చెప్పుకొచ్చారు.

బాంబే వెల్వెట్ విష‌యంలో ఇత‌రుల ఫింగ‌రింగ్ చివ‌రికి ప్రాజెక్ట్ డిజాస్ట‌ర్ అవ్వ‌డానికి కార‌ణ‌మైన తీరును అత‌డు తాజా పాడ్ కాస్ట్ లో వ‌ర్ణించాడు. మొద‌ట ఈ సినిమాని అంత‌గా పాపులారిటీ లేని ర‌ణ్ వీర్ సింగ్ తో తెర‌కెక్కించాల‌ని అనురాగ్ అనుకున్నారు. కేవ‌లం 28కోట్ల బ‌డ్జెట్ లో పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్ధేశించాడు. కానీ ఇంత‌లోనే ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఇన్వాల్వ్ మెంట్, ఇత‌రులు ప్ర‌మేయం పెరిగింది. అప్ క‌మ్ స్టార్ ర‌ణ్ వీర్ తో ఇది వ‌ర్క‌వుట్ కాదు.. ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి పెద్ద హీరోతో తీయాల‌ని ద‌ర్శ‌కుడు అనురాగ్ పై ఒత్తిడి పెరిగింది. చాలా మంది పెద్ద ద‌ర్శ‌కులు కూడా అనురాగ్ కి ఇదే సూచించారు. పెద్ద హీరోని తీసుకుని సెట్స్ పైకి వెళ్లాల‌ని చెప్పారు. అయితే అనురాగ్ ఆలోచ‌న‌లు వేరు. అత‌డు ప‌రిమిత బ‌డ్జెట్లో సేఫ్ ప్రాజెక్ట్ గా దీనిని ప్లాన్ చేసాడు. త‌న ఆలోచ‌న‌లు సృజ‌నాత్మ‌క‌త‌కు అనుగుణంగా పాత్ర‌ధారుల‌ను ఎంపిక చేసుకోవాల‌నుకున్నా, ఇత‌రుల ఫింగ‌రింగ్ ఎక్కువ అవ్వ‌డంతో అది అతుకుల బొంత‌గా మారింది.

ఈ ప్రాసెస్ లోనే అత‌డు ఏడాదిన్న‌ర పాటు బాంబే వెల్వెట్ చిత్రీక‌ర‌ణ‌కు దూరంగా ఉన్నాడు. చివ‌రికి ర‌ణ‌బీర్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించి రిలీజ్ చేసాడు. కానీ ఫ‌లితం ఘోరంగా వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా డిజాస్ట‌ర్ అయింది.

ఒకానొక ద‌శ‌లో `నేను సినిమాను వదిలేశాను` అంటూ ర‌ణ్ వీర్ సింగ్ కి మెసేజ్ పంపినందుకు తనను ఎలా తిట్టారో కూడా అనురాగ్ కశ్యప్ వెల్లడించాడు. బ‌డ్జెట్ కాన్వాస్ మారిపోయాక తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. సెట్స్ కి సాధార‌ణ కార్ లో వెళ్లాల్సిన వాళ్లు కూడా బెంజిలో వెళ‌తారు. హ‌ఠాత్తుగా శ్రీ‌లంక‌లో భారీ రిసార్ట్ సెట్ ల‌ను కూడా నిర్మించారు. ఇదంతా ఖ‌ర్చును పెంచింది.

అస‌లు 90 కోట్లు దేనికి? అంత బ‌డ్జెట్ పెట్ట‌కూడ‌దు. కానీ అది పెరుగుతూనే ఉంది. చివ‌రికి సృజ‌నాత్మ‌క‌త‌ను బ‌డ్జెట్ డామినేట్ చేసింది! అంటూ సింపుల్ గా రీజ‌న్ చెప్పాడు అనురాగ్ క‌శ్య‌ప్. ఈ ఉదాహ‌ర‌ణ ఎలా ఉన్నా కానీ టాలీవుడ్ లో చాలా మంది తెలివైన నిర్మాత‌లు అన‌వ‌స‌రంగా ద‌ర్శ‌కుడు లేదా ర‌చ‌యిత ప‌నుల్లో వేలు పెట్ట‌రు. కొంద‌రు నిర్మాత‌లు త‌మ సామ‌ర్థ్యాన్ని నిరూపించుకోవాల‌ని అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన‌ప్పుడు ఫ‌లితాలు తారుమారైన విష‌యాల‌ను తెలివిగా విశ్లేషిస్తారు.

ఇత‌రుల కెరీర్ విష‌యంలో కానీ, జీవితం విష‌యంలో కానీ వేరొక‌రు వేలు పెడితే దాని ఫ‌లితం ఇలానే ఉంటుంద‌న‌డానికి చాలా ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.