40 ఏళ్లకు నటన నేర్చుకున్న బాబి డియోల్
నిజమైన నటులకు, కృత్రిమంగా పుట్టుకొచ్చే నటులకు మధ్య తేడా ఏమిటో అనురాగ్ కశ్యప్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
By: Sivaji Kontham | 7 Nov 2025 11:00 PM ISTనిజమైన నటులకు, కృత్రిమంగా పుట్టుకొచ్చే నటులకు మధ్య తేడా ఏమిటో అనురాగ్ కశ్యప్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నిజమైన నటులు గ్రౌండ్ లెవల్ నుంచి పుట్టుకొస్తారని అన్నాడు. దీని అర్థం నటవారసులు ఈ రంగంలో రాణించరు అనే అర్థం కాదు. విక్కీ కౌశల్ , బాబి డియోల్ మధ్య ఒక తేడా ఏమిటో కూడా వెల్లడించాడు. విక్కీ కౌశల్ ఆరంభం తన సినిమా సెట్లలో అసిస్టెంట్ గా పని చేసాడని, ఆ సమయంలోనే నటుడి గొప్పతనం ఏమిటో దగ్గరగా చూసి తెలుసుకున్నాడని తెలిపాడు. విక్కీ ఎప్పుడూ నటుడవ్వాలని అనుకునేవాడు. అతడు చాలా సినిమాలకు సెట్లలో పని చేసి చాలా నేర్చుకున్నాడు. చాలా చిన్న వయసు నుంచి హార్డ్ వర్క్ చేసాడు. ఒక రకంగా 20 వయసు నుంచే విక్కీకి నటన తెలుసు.
కానీ బాబి డియోల్ స్టోరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అతడు 40 వయసు వచ్చే వరకూ నటన గురించి తెలుసుకోలేకపోయాడు. ఒక రకంగా 40 వయసులో అతడు నటశిక్షణకు వెళ్లాడట. చాలా ఏళ్ల పాటు సినిమాల్లో అవకాశాల్లేక ఇంటికే పరిమితమైపోయాడు బాబి డియోల్. ఆ కఠిన సమయంలో నగరంలో ఎక్కడైనా సెట్లలో నటులను, లైటింగ్ వంటివి చూస్తే పిచ్చెక్కి అరిచేసేవాడు. నేను ఎందుకు అక్కడ లేను! అని ఫీలయ్యేవాడట. ఈ విషయాన్ని బాబి డియోల్ స్వయంగా చెప్పాడు. తనకు ఎవరూ నటశిక్షణకు వెళ్లాలని సలహా ఇవ్వలేదని కూడా అతడు అన్నాడు. దయచేసి నాకు పని ఇవ్వండి అని బతిమాలుకునేంతగా చీకటి రోజులను అనుభవించాడు బాబి.
ఐదు సంవత్సరాల వయసులో నేను స్టార్ అవుతానని నాకు తెలుసు... స్టార్ అయ్యాను. కానీ తర్వాత అంతా అయిపోయింది. ఇండస్ట్రీ జనం కాల్ చేయడం మానేశాను.. పనికి పిలవడం మానేశారని బాబి డియోల్ నిజాయితీగా అంగీకరించినట్టు అనురాగ్ చెప్పారు.
జుహులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెట్‌లో వానిటీ వ్యాన్లు లేదా షూటింగ్ లైట్లు చూసినప్పుడల్లా కోపంగా మారిపోవడమో లేదా ఏడ్వడమో చేస్తానని బాబీ నాకు చెప్పాడని అనురాగ్ తెలిపారు. తనకు 40 ఏళ్లు వచ్చే వరకు ఎవరూ నటన లో వర్క్‌షాప్ తీసుకోవాలని చెప్పలేదని ఆయన వివరించారు. అప్పుడే తాను నిజంగా నటన నేర్చుకోవడం ప్రారంభించాడు. క్లాస్ ఆఫ్ 83, లవ్ హాస్టల్, ఆశ్రమ్ వంటి సినిమాల కోసం బాబి- అనురాగ్ కలిసి పనిచేశారు. తన నిజ జీవితానికి భిన్నమైన పాత్రలు పోషించినప్పుడు మాత్రం ఒక పాత్ర పోషించడం ఎంత ముఖ్యమో తనకు అర్థమైందని బాబి తెలిపారు. బాబి డియోల్ తో పోల్చినప్పుడు విక్కీ కౌశల్ చిన్నప్పటి నుంచి నటుడవ్వాలని తపించాడు. 20 వయసుకే సెట్లో అసిస్టెంట్ గా పని చేసాడు. తన తండ్రి యాక్షన్ కొరియోగ్రఫీ అందించే సినిమాలకు విక్కీ పని చేసేవాడు! అంటూ గుర్తు చేసుకున్నాడు.
