దర్శకుడి లవ్ స్టోరీ.. అచ్చం విశ్వనాథ్ అండ్ సన్స్‌లాగే
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో ఒక కొత్త తరహా ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి.
By: Garuda Media | 18 Aug 2026 10:00 PM IST‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో ఒక కొత్త తరహా ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇందులో హీరో వయసు 42 ఏళ్లయితే.. హీరోయిన్‌కేమో 22 ఏళ్లు. ఇద్దరి మధ్య వయసు అంతరం 20 ఏళ్లుంటుంది. అయినా సరే కథానాయికకు అదేమీ పెద్ద అడ్డంకిగా అనిపించదు. హీరోతో ప్రేమలో పడిపోతుంది. తన ప్రేమ కోసం ఆరాటపడుుతంది. కానీ హీరోకు మాత్రం వయసు అంతరం పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ఎవరెంత చెప్పినా వినడు. అంత ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటా అంటాడు. కానీ చివరికి అతడి మనసు కరిగిపోతుంది. బాలీవుడ్లో ఇప్పుడు ఇలాంటి ఒక ప్రేమకథ నడుస్తోంది. సీనియర్ దర్శకుడు, 53 ఏళ్ల అనురాగ్ కశ్యప్.. తనకంటే 23 ఏళ్లు చిన్నదైన శుభ్రాశెట్టి (30)తో ప్రేమలో పడ్డాడు. కొంత కాలంగా వీరి మధ్య రిలేషన్‌షిప్ నడుస్తోంది.
ఐతే వయసు అంతరం తమ మధ్య పెద్ద సమస్య కాదని అంటున్నాడు అనురాగ్. వయసు తేడా కారణంగా ఆమె నుంచి దూరంగా ఉండాలని మొదట ప్రయత్నించానని.. కానీ తనతో ఉన్నపుడు తమ మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నట్లు అనిపించలేదని అనురాగ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం శుభ్రాశెట్టితో తాను చాలా సంతోషంగా ఉన్నానని.. ఈ సంతోషాన్ని కోల్పోవాలని అనుకోవట్లేదని అనురాగ్ వ్యాఖ్యానించాడు. పెళ్లి కంటే తమకు ఈ బంధంలో కలిసి ఉండడం ముఖ్యమని.. దానికి ప్రత్యేకంగా పేరు పెట్టాల్సిన అవసరం లేదని అనురాగ్ అన్నాడు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో హీరో లాగే మొదట ఏజ్ గ్యాప్ అనురాగ్‌కు సమస్యగా అనిపించినా.. తర్వాత అది పెద్ద విషయంగా కనిపించక శుభ్రాతో కంటిన్యూ అవుతున్నాడు. అనురాగ్‌కు గతంలో రెండుసార్లు పెళ్లయింది. 1997-2009 మధ్య ఆయన ఆర్తి బజాప్‌తో వివాహ బంధంలో ఉన్నాడు. తర్వాత 2011లో నటి కల్కి కొచ్లిన్‌ను పెళ్లాడని అనురాగ్.. నాలుగేళ్లకే ఆమె నుంచి విడిపోయాడు.
