డెకాయిట్ లో 'ఇన్స్పెక్టర్ స్వామి'.. పవర్ ఫుల్ గా బాలీవుడ్ డైరెక్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ లో డెకాయిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 10 Sept 2025 3:18 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ లో డెకాయిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాను షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న డెకాయిట్ లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. స్వామి అనే పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో సినిమాలో ఆయన కనిపించనున్నట్లు ప్రకటించి.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్ లో అనురాగ్.. అయ్యప్ప మాల ధరించి గడ్డం, మీసాలతో న్యూ లుక్ లో కనిపించారు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన బర్త్ డే సందర్భంగా మేకర్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇన్స్పెక్టర్ స్వామికి డెకాయిట్ మూవీ టీమ్ తరఫున విషెస్ కూడా చెప్పారు.
ఆయన మాత్రమే ఇన్స్పెక్టర్ స్వామి రోల్ చేయగలరని, ఆ పాత్రకు వన్నె తెచ్చారని కొనియాడారు. డిసెంబర్ 25వ తేదీన సినిమా రిలీజ్ చేయనున్నట్లు మరోసారి వెల్లడించారు. అయితే గ్లింప్స్ లో అనురాగ్.. సెట్స్ లో ఎంత జోవియల్ గా ఉంటారో అర్థమవుతోంది. ఫ్రీ టైమ్ తో సరదాగా క్యాస్టింగ్ తో గడుపుతున్నట్లు కనిపించారు.
అదే సమయంలో యాక్టింగ్ తో డెకాయిట్ లో అనురాగ్ కశ్యప్ కచ్చితంగా అదరగొట్టనున్నారని గ్లింప్స్ చూశాక చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయ్యప్ప మాల ధరించిన గెటప్ లో ఆయన ఉండగా.. గ్లింప్స్ లో డైరెక్టర్ సాబ్ మార్క్ యాక్షన్ కనపడింది. సినిమాలో అనురాగ్ కశ్యప్ ది పవర్ ఫుల్ క్యారెక్టర్ అని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక అనురాగ్ విషయానికొస్తే.. ఇప్పటికే ఆయన వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ పార్ట్ 1 & పార్ట్ 2, రామన్ రాఘవ్ 2.0, లస్ట్ స్టోరీస్ వంటి పలు సినిమాలు రూపొందించారు. ఇప్పుడు యాక్టర్ గా అలరిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్, మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు డెకాయిట్ తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.
