బాలీవుడ్‌లో పవర్ గేమ్.. ఒక్క డెసిషన్ జీవితాన్నే మార్చేస్తుందా?
బాలీవుడ్‌లో అవకాశాలు, పరిచయాలు, పలుకుబడి చుట్టూ ఉండే పవర్ డైనమిక్స్‌పై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మరోసారి తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Aug 2026 12:41 PM ISTబాలీవుడ్‌లో అవకాశాలు, పరిచయాలు, పలుకుబడి చుట్టూ ఉండే పవర్ డైనమిక్స్‌పై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మరోసారి తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. బాలీవుడ్ లో ఇంపాక్ట్‌ఫుల్ వ్యక్తుల కారణంగా కొందరు తమకు ఇష్టం లేని డెసిషన్స్ ను కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. జానిస్ సిక్వేరాతో జరిగిన సంభాషణలో ఇండస్ట్రీలోని ఈ అంశాలపై ఆయన మాట్లాడారు.
ప్రతి రాజీ కూడా పర్సనల్ గా తీసుకున్న స్వచ్ఛంద నిర్ణయం కాకపోవచ్చని అనురాగ్ అన్నారు. కొన్ని సందర్భాల్లో సిట్యుయేషన్స్, ఛాన్సెస్, వ్యక్తిగత ప్రయోజనాలు కలిసి ఒక డెసిషన్ తీసుకునేలా చేస్తాయని, అయితే అసలు సమస్య ఆ డెసిషన్ తర్వాత మొదలవుతుందని ఆయన సూచించారు. ఒకసారి ఏదైనా డీల్ కు ఒప్పుకుని దాని ద్వారా ప్రయోజనం పొందిన తర్వాత, ఫ్యూచర్ లో అదే వ్యక్తికి నో చెప్పడం అంత ఈజీ కాదని వివరించారు.
ఈ సిట్యుయేషన్ ను ఆయన ఒకసారి తెరిచిన తలుపుతో పోల్చారు. మొదట తీసుకున్న డెసిషన్ తర్వాత మరో అడుగు వేయాల్సిన పరిస్థితి రావచ్చు. అలా చిన్న కాంప్రమైజ్ క్రమంగా మరిన్ని కాంప్రమైజ్‌లకు దారి తీసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తమ పరిస్థితి గురించి అవగాహన ఉన్నప్పటికీ, దాని నుంచి బయటపడటానికి కొందరు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. తమ డెసిషన్స్‌పై అసౌకర్యంగా లేదా ఇబ్బందిగా భావించినా, సిట్యుయేషన్స్ ను మార్చలేని పొజిషన్ లో ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో బాలీవుడ్‌తో సౌత్ సినీ ఇండస్ట్రీలను కూడా అనురాగ్ కశ్యప్ కంపేర్ చేశారు. సౌత్ స్టేట్స్ లో సినిమాకు ఉన్న బలమైన ప్రాంతీయ అనుబంధం, స్థానిక సంస్కృతి అక్కడి ఇండస్ట్రీలకు ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయని ఆయన భావిస్తున్నారు. అంతేకాకుండా సౌత్ సినిమాలు తమ స్వంత భాషా మార్కెట్లలోనే బలమైన ప్రేక్షకాదరణ పొందగలగడం వల్ల హిందీ మార్కెట్‌పై ఆధారపడాల్సిన అవసరం తక్కువగా ఉంటుందని అన్నారు. అనురాగ్ కామెంట్స్ మరోసారి సినిమా పరిశ్రమలో అధికారం, అవకాశాలు, పరిచయాలు, వ్యక్తిగత ప్రయోజనాల మధ్య ఉన్న సంబంధాలపై చర్చకు దారితీశాయి. భిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ గతంలోనూ ఇండస్ట్రీలోని వ్యవస్థపై తన అభిప్రాయాలను బహిరంగంగా పంచుకున్న విషయం తెలిసిందే.
