ఏజ్ గ్యాప్ ఇబ్బంది పెట్టింది.. కానీ ఆమెతో చాలా హ్యాపీగా ఉన్నా: అనురాగ్ కశ్యప్!
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన సినిమాలతోనే కాకుండా బోల్డ్ వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
By: Madhu Reddy | 17 Aug 2026 8:20 PM ISTబాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన సినిమాలతోనే కాకుండా బోల్డ్ వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న తన వ్యక్తిగత జీవిత విశేషాలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 53 ఏళ్ల వయసున్న అనురాగ్, తనకంటే దాదాపు 23 ఏళ్లు చిన్నదైన 30 ఏళ్ల శుభ్రశెట్టితో గడిపిన సహజీవన అనుభవాన్ని, వయసు తేడా వల్ల పడిన ఇబ్బందులను చాలా స్పష్టంగా బయటపెట్టారు. ఆ వివరాలు చూద్దాం..
వయసు వ్యత్యాసంతో కలిగిన ఇబ్బంది:
శుభ్రశెట్టితో బంధం ప్రారంభమైన కొత్తలో వారిద్దరి మధ్య ఉన్న 23 ఏళ్ల వయసు వ్యత్యాసం తమను కొంత ఇబ్బందికి గురి చేసిందని అనురాగ్ కశ్యప్ అంగీకరించారు. ఇక వయసు పెరిగే కొద్దీ సమాజం ఏమనుకుంటుందో అనే సంకోచంతో ఆమెకు దూరంగా ఉండటానికి కూడా ప్రయత్నించినట్లు చెప్పారు. అయితే సమయం గడిచే కొద్దీ ఆమెతో ఉన్న మానసిక అనుబంధం ముందు ఆ ఏజ్ గ్యాప్ ఒక పెద్ద సమస్యగా అనిపించలేదని వెల్లడించారు.
సంతోషాన్ని ఇస్తున్న ప్రస్తుత జీవితం:
ప్రస్తుతం శుభ్రశెట్టితో గడుపుతున్న జీవితం తనకు ఎనలేని ఆనందాన్ని ఇస్తోందని అనురాగ్ స్పష్టం చేశారు. జీవితంలో దక్కిన ఈ ప్రశాంతతను, సంతోషాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవాలని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఇక పెళ్లి చేసుకుని సంబంధానికి ఒక అధికారిక ముద్ర వేయడం కంటే, ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితాన్ని ఆస్వాదించడమే తమకు ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
గత వివాహాలు మరియు సహజీవనం:
అనురాగ్ కశ్యప్‌కు గతంలో రెండుసార్లు వివాహమై విడాకులతో ముగిసాయి. 1997లో ఆర్తీ బజాజ్‌ను వివాహం చేసుకోగా వీరికి ఆలియా అనే కుమార్తె జన్మించింది. ఆ తర్వాత 2009లో విడిపోయి, 2011లో నటి కల్కి కోచ్లీన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2015లో ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు.
డెకాయిట్ మూవీలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించి అలరించారు. ఈ మూవీ ఇది తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. రెండు పెళ్లిళ్లు విఫలమైన అనుభవంతో, ఇప్పుడు ఈ వయసులో మూడో పెళ్లి కంటే ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండే సహజీవనమే నయమని అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
