Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్.. ముందు ఫిక్స్ అయ్యే అలా చేశా..!

ఒకే హీరోయిన్ రెండు వెర్షన్ లా చూడాల్సి వస్తే అది అనుపమ పరమేశ్వరన్ అనేలా చేసుకుంది అమ్మడు.

By:  Ramesh Boddu   |   12 Aug 2025 12:10 PM IST
టిల్లు స్క్వేర్.. ముందు ఫిక్స్ అయ్యే అలా చేశా..!
X

ఒకే హీరోయిన్ రెండు వెర్షన్ లా చూడాల్సి వస్తే అది అనుపమ పరమేశ్వరన్ అనేలా చేసుకుంది అమ్మడు. అఆ, ప్రేమమ్ సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. యువ హీరోల నుంచి టైర్ 2 హీరోల దాకా అనుపమ జత కడుతూ వచ్చింది. అమ్మడు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ మెప్పిస్తూ వచ్చింది. ఐతే ఎందుకో అమ్మడు ఆశించిన స్థాయి పాపులారిటీ తెచ్చుకోలేదు. అంతకుముందు అనుపమ గ్లామర్ షోకి దూరంగా మంచి రోల్స్ చేస్తూ వచ్చింది.

టిల్లు స్క్వేర్ లో లిప్ లాక్, స్కిన్ షో..

ఐతే స్లిం అయ్యాక అనుపమ పూర్తిగా మారిపోయింది. ఆమె గ్లామర్ షోతో ఫోటో షూట్స్ చేయడమే కాదు టిల్లు స్క్వేర్ లో తన లిప్ లాక్, స్కిన్ షోతో షాక్ ఇచ్చింది. టిల్లు స్క్వేర్ లో అనుపమని అలా చూసిన వాళ్లు షాక్ అయ్యారు. ఐతే టిల్లు స్క్వేర్ సినిమా గురించి తన మనసులో ఉన్న మాటని బయట పెట్టింది అనుపమ పరమేశ్వరన్. నా ఫ్యాన్స్ కి ఆ రోల్ నచ్చలేదని తెలుసు. నేను కూడా ఆ సినిమా చేయడానికి చాలా టైం తీసుకున్నా.. చెయ్యాలా వద్దా అని ఆలోచించా.. కానీ చేసినా తప్పేముంది అనిపించింది.

ఐతే డెసిషన్ తీసుకున్నా కూడా అలా చేయడం కాస్త కష్టమైంది. అందుకే ఆ సినిమాలో 100 శాతం కాన్ ఫిడెంట్ గా చేయలేదని అంటుంది అనుపమ. సినిమాలోనే కాదు ప్రమోషన్స్ లో కూడా అలాంటి డ్రస్సులు వేసుకోవడం కంఫర్ట్ అనిపించలేదు. ఐతే దాన్ని ఒక ఛాలెంజ్ లా తీసుకుని చేశా అన్నది అనుపమ. ఆ రోల్ చేస్తే ఏమనుకుంటారా అన్న డౌట్ ఉంది. సినిమాలో ఆ రోల్ చాలా స్ట్రాంగ్ అని భావించే చేశానని అన్నది అనుపమ.

అనుపమ పరమేశ్వరన్ విమర్శలకు రెడీ

టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక హీరోకి ఈక్వల్ గా ఉందని అన్నారు. అందుకే అలాంటి పాత్రలు వదుకోదల్చుకోలేదని అన్నది అనుపమ. ఐతే సినిమా చేయడానికి ఫిక్స్ అయినప్పుడే విమర్శలకు తాను రెడీ అయ్యానని చెప్పుకొచ్చింది అమ్మడు. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ పై తనకున్న ఒపీనియన్ ని బయట పెట్టింది. ఇదే కాదు హీరోయిన్ ఏదైనా మాట్లాడితే ఆమెకు యాటిట్యూడ్ అంటారని తనకు జరిగిన మిగతా ఎక్స్ పీరియన్స్ లను కూడా బయట పెట్టింది అనుపమ.

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమా చేసింది. ఆ సినిమా ఆగష్టు 22న రిలీజ్ అవుతుంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో అనుపమ మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది.