యంగ్ హీరోయిన్ పెళ్లికి రెడీ అవుతుందా? నిజమెంత?
సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. హీరోలు, హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాల్లో కొత్త ఛాప్టర్స్ మొదలు పెడుతున్నారు.
By: M Prashanth | 4 April 2026 2:56 PM ISTసినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. హీరోలు, హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాల్లో కొత్త ఛాప్టర్స్ మొదలు పెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. అదే సమయంలో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులనే కొందరు సెలబ్రిటీలు ప్రేమ వివాహాలను చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ పెళ్లి వార్తలు రావడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి.
దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా వచ్చే నెలలో ఆమె నిశ్చితార్థం జరగనుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో నిజమెంతో తెలియకపోయినా.. నెట్టింట మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.
మలయాళ సినిమా ప్రేమమ్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అనుపమ, తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి అవకాశాలు దక్కించుకున్నారు. తెలుగులో ప్రేమమ్, కార్తికేయ 2 వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. టిల్లు స్క్వేర్ వంటి సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు పొందిన అమ్మడు.. వరుస విజయాలతో ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు.
ఇలాంటి సమయంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు, యువ హీరో ధృవ్ విక్రమ్ తో అనుపమకు ఉన్న స్నేహం ప్రేమగా మారిందని టాక్ కూడా వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన బైసన్ సినిమా సమయంలో మరింత దగ్గరయ్యారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అదే కాకుండా, ఇటీవల కాలంలో ఇద్దరూ కలిసి కొన్ని ప్రైవేట్ ఈవెంట్లలో కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు స్పందించడం, పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడం వంటి అంశాలు ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. దీంతో వీరి మధ్య ఉన్న బంధం కేవలం స్నేహం కాదని, ప్రేమ సంబంధమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారి కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉన్నట్లు సమాచారం. పెద్దల సమ్మతితోనే ఆ జంట పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఆ వార్తలపై ఇప్పటివరకు అనుపమ పరమేశ్వరన్ గానీ, ధృవ్ విక్రమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఆ ప్రచారం ఎంతవరకు నిజమనేది ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి.. కెరీర్‌లో మంచి ఫామ్ లో ఉన్న అనుపమ పరమేశ్వరన్ పెళ్లి వార్తలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిజంగా ఆ గుసగుసలు నిజమవుతాయా? లేక కేవలం రూమర్స్ గానే మిగిలిపోతాయా? అన్నది వేచి చూడాలి.
