Begin typing your search above and press return to search.

చిరునవ్వుతో హృదయాలు దోచేస్తోన్న అనుపమ..

ఒకప్పుడు కూడా సోషల్ మీడియా అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న పాపులారిటీ అప్పుడు లేదనే చెప్పాలి.

By:  Madhu Reddy   |   11 Dec 2025 8:00 PM IST
చిరునవ్వుతో హృదయాలు దోచేస్తోన్న అనుపమ..
X

ఒకప్పుడు కూడా సోషల్ మీడియా అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న పాపులారిటీ అప్పుడు లేదనే చెప్పాలి. అందుకే చాలామంది హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు ? అనే విషయం పెద్దగా అభిమానులకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో సెలబ్రిటీలు ఏ చిన్న విషయాన్నైనా సరే ఇట్టే సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు చేరువవుతున్నారు. మరి కొంతమంది కాస్త సమయం దొరికితే చాలు ట్రెండీగా రెడీ అవుతూ ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.




ఇంకొంతమంది వెకేషన్స్ కి వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. అలాగే ట్రెడిషనల్ వేర్ తో కూడా ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న విషయం తెలిసిందే.




ఈ క్రమంలోనే తన అందాలతో ఆకట్టుకునే అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మరొకసారి చీరకట్టులో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. సిల్వర్ కలర్ వేవింగ్ శారీ ధరించిన అనుపమ పరమేశ్వరన్.. దానికి బోర్డర్లో బ్లూ కలర్ తో చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇక ఈ బ్లూ కలర్ బోర్డర్ ను హైలెట్ చేస్తూ బ్లూ కలర్ కలంకారి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసింది అనుపమ పరమేశ్వరన్

తన ఉంగరాల జుట్టును ముడిపెట్టిన ఈమె చెవులకు పెద్ద జుంకాలు కూడా ధరించింది. ఇక మెడను బోసిగా ఉంచేసి తన మొత్తం మేకోవర్ తో ఫోటోషూట్ చేసి అభిమానుల ముందు ఉంచింది. ఇక ఈ ఫోటోలలో ఈమె ఇచ్చిన స్మైల్ అభిమానుల హృదయాలను తాకుతున్నాయి అనడంలో సందేహం లేదు. అలా చక్కటి చిరునవ్వుతో చీర కట్టులో కనిపించి అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం అనుపమ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన అనుపమ.. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ - సమంత కాంబినేషన్లో వచ్చిన అ ఆ అనే సినిమా ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించి తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి సినిమా ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. మధ్యలో రంగస్థలం సినిమాలో కూడా అవకాశం వచ్చిందని ఈమె రిజెక్ట్ చేసిందనే కొన్ని పుకార్లు కూడా సృష్టించబడ్డాయి. కానీ అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో కిష్కింధపురి , బైసన్ వంటి పలు చిత్రాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాలతో మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ