వామ్మో.. అనుపమ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ వదులుకుందా? అవన్నీ చేసిండుంటే?
ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.
By: Madhu Reddy | 26 Oct 2026 10:38 AM ISTఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఇటీవల ‘క్రేజీ కల్యాణం’తో అలరించిన ఈ భామ, త్వరలోనే ‘భోగీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ ‘ప్రేమమ్’తో ఎంట్రీ ఇచ్చి, తెలుగులో ‘అ ఆ’ సినిమాతో మన మనసు దోచుకున్న ఈ క్యూట్ హీరోయిన్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను మిస్ చేసుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలపై క్లారిటీ ఇచ్చింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
రంగస్థలం ఆడిషన్ ఇచ్చి మిస్ అయ్యా:
ఈ ఇంటర్వ్యూలో తాను మిస్ చేసుకున్న సినిమాల గురించి చెబుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది అనుపమ. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ సినిమా కోసం తాను ఆడిషన్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఆడిషన్స్ పూర్తయ్యాక కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ మిస్ అయిందని తెలిపింది. అయితే దర్శకుడు సుకుమార్ గారిని మళ్ళీ అవకాశం అడగలేదా అని ప్రశ్నించగా.. "నేనొక నటిని, నాకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే ఆయనే పిలుస్తారు. ఆ తర్వాతే సుకుమార్ రైటింగ్స్‌లో '18 పేజెస్' చేశాను" అని చెప్పుకొచ్చింది.
గీతా గోవిందం రిజెక్ట్ చేసింది నిజమే:
విజయ్ దేవరకొండ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘గీతా గోవిందం’ సినిమాను తాను ఓకే చేసిన తర్వాత వదులుకున్నట్లు అనుపమ ఒప్పుకుంది. కథ చర్చల దశ వరకు వెళ్లాక కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వద్దనుకున్నానని స్పష్టం చేసింది. అలాగే శర్వానంద్‌తో ‘మహానుభావుడు’ సినిమాపై డిస్కషన్ జరిగింది కానీ కుదరలేదని, ఆ తర్వాత వారి కాంబినేషన్లో ‘శతమానం భవతి’ తీశామని గుర్తుచేసుకుంది. ‘నేను శైలజ’ టైమ్‌లో ‘నేను లోకల్’ మూవీ చర్చలు కూడా జరిగాయని చెప్పింది.
రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనుపమ:
సోషల్ మీడియాలో తాను చాలా సినిమాలు రిజెక్ట్ చేసినట్లు వస్తున్న వార్తలపై అనుపమ తీవ్రంగా స్పందించింది. నాని నటించిన ‘వి’ (V) సినిమా నా వరకు అసలు రాలేదని, అది తప్పుడు ప్రచారమని ఖండించింది. అలాగే హేమంత్ మధుకర్ ‘నిశ్శబ్దం’, నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’, రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలకు కూడా తాను నో చెప్పలేదని, అసలు ఆ సినిమాల కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదని తేల్చేసింది.
కేవలం ఆ రెండు సినిమాలే వదులుకున్నా:
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నవన్నీ అబద్ధాలని, తాను కేవలం రిజెక్ట్ చేసినవి లేదా మిస్ అయినవి ‘రంగస్థలం’, ‘గీతా గోవిందం’ సినిమాలు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ప్రచారాలు రావడం సహజమేనని, అభిమానులు ఈ రూమర్లను నమ్మవద్దని కోరింది.
ఇక మొత్తానికి చూస్తే, కెరీర్ ప్రారంభంలో కొన్ని బిగ్ ప్రాజెక్ట్‌లు మిస్ అయినా కూడా అనుపమ పరమేశ్వరన్ టాలెంట్ మీద నమ్మకంతో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ‘భోగీ’ ప్రమోషన్స్‌తో సందడి చేస్తున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ, రాబోయే రోజుల్లో ఎలాంటి సక్సెస్‌లు అందుకుంటుందో చూడాలి.
