స్కూల్ టీనేజర్ హద్దు మీరాడు.. అనుపమ ఫిర్యాదు!
ఓ సినిమా షూటింగ్ సమయంలో స్కూల్‌కు చెందిన టీనేజర్ తనపై పుస్తకాలు విసిరి, అసభ్యంగా ప్రవర్తించాడని అనుపమ పరమేశ్వరన్ వెల్లడించారు. నటీనటులు కూడా భావోద్వేగాలు, వ్యక్తిగత హద్దులు ఉన్న సాధారణ మనుషులేనని, సెలబ్రిటీ హోదాను వేధింపులకు అనుమతిగా చూడకూడదని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
By: Sivaji Kontham | 30 Nov 2026 1:00 AM ISTయువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఒక పాఠశాలలో షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక స్కూల్ టీనేజర్ తనపైకి పుస్తకాలు విసిరి.. హద్దులు దాటి అమర్యాదగా ప్రవర్తించాడని బాధపడ్డారు. సెలబ్రిటీలు అన్న కారణంతో కొందరు ఎలాంటి సంకోచం లేకుండా చనువు తీసుకుని.. అది వారిని ఎంతగా బాధిస్తుందో ఆలోచించకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో నటులను కేవలం తెరపై కనిపించే సెలబ్రిటీలుగా కాకుండా..వ్యక్తిగత హద్దులు- భావోద్వేగాలు ఉన్న సాధారణ మనుషులుగా గౌరవించాలని కోరుతూ ఈ మల్లూ బ్యూటీ షేర్ చేసిన ఇన్ స్టాగ్రమ్ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
``ప్రతి ఒక్కరూ ముందుగా మనుషులేనన్న విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. నటి అయినంత మాత్రాన మనుషులుగా తక్కువ అయిపోరు. బయట ఏదో ఒక సాధారణ వ్యక్తిపై ఇలా దాడి చేయరు కదా.. కీర్తిని ఎవరినైనా బాధపెట్టడానికి అనుమతిగా ఎప్పటికీ చూడకూడదు`` అంటూ నోట్ ని షేర్ చేయగా అది నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. నిజానికి అందాల హీరోయిన్ల విషయంలో కొందరు టీనేజర్లు, ఆకతాయిలు హద్దులు దాటి ప్రవర్తించడం ఇటీవల ఎక్కువవుతోంది. ముఖ్యంగా మార్ఫ్‌డ్ ఫోటోలు, వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా తారలను మానసిక వేదనకు గురిచేస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్ విషయంలో ఇలాంటి ఇబ్బందికర సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఒక తమిళ యువతి అనుపమ మార్ఫ్‌డ్ ఫోటోలను తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన కేసు పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా అనుపమ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించి.. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై గట్టిగా ప్రతిస్పందించారు. అంతకుముందు కూడా సోషల్ మీడియా ట్రోలింగ్... సినిమాల ఎంపిక లేదా వ్యక్తిగత జీవితంపై వచ్చే ఊహాగానాల వల్ల పలుమార్లు అసహనానికి గురయ్యారు.
ఇటీవలే తన గత ప్రేమ సంబంధం- ప్రియుడి విషయంలోనూ అనుపమ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చగా మారాయి. ఒకరి చేతిలో బందీఖానాలో ఉన్నట్లుగా జీవించడం తనకు ఇష్టం లేదని.. ఆ బంధం నుంచి విడిపించుకుని స్వేచ్ఛగా బయటపడిన తర్వాత ఇప్పుడు ఎంతో సంతోషంగా- ప్రశాంతంగా ఉన్నానని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల నుంచి బయటపడి.. కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టిన సమయంలో ఇలాంటి అనుభవాలు ఎదురుకావడం తనను కలత చెందేలా చేసింది.
వెండితెరపై నవ్వులు పూయించే తారల వెనుక కూడా ఎన్నో భావోద్వేగాలు.. ఆత్మగౌరవం ఉంటాయనే విషయాన్ని అనుపమ తాజా స్పందన మరోసారి గుర్తుచేస్తోంది. అభిమానం పేరుతో లేదా సరదా కోసం హద్దులు దాటడం సరికాదని.. పబ్లిక్ ప్రదేశాల్లో అయినా,, సోషల్ మీడియా వేదికలపైన అయినా సెలబ్రిటీల వ్యక్తిగత హద్దులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. కెరీర్ మ్యాటర్ కి వస్తే అనుపమ ఈ ఏడాది రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. ఒకటి శర్వానంద్ సరసన భోగి.. మరొకటి తరుణ్ భాస్కర్ తో క్రేజీ కళ్యాణం. ఈ రెండు సినిమాలు ఇటీవలే విడుదల కాగా అనుపమ క్యూట్ పెర్ఫామెన్స్ కి మంచి పేరొచ్చింది.
