Begin typing your search above and press return to search.

సులోచన రాణిగా అనుపమ షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్

టాలీవుడ్‌లో వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న హీరో శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న పీరియడ్ యాక్షన్ చిత్రం భోగిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   30 April 2026 12:19 PM IST
సులోచన రాణిగా అనుపమ షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్
X

టాలీవుడ్‌లో వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న హీరో శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న పీరియడ్ యాక్షన్ చిత్రం భోగిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన క్యారెక్టర్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఈ పోస్టర్‌లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కందుల సులోచన రాణిగా కనిపిస్తూ తన పాత్రలో ఉన్న డెప్త్ ను స్పష్టంగా చూపించారు. ఇప్పటివరకు చేసిన సాధారణ పాత్రలకు పూర్తి భిన్నంగా, ఈ సినిమాలో అనుపమ రఫ్ అండ్ నేచురల్ లుక్‌లో కనిపించడం విశేషం.





రిలీజైన పోస్టర్‌లో అనుపమ గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నారు. తలపై పెద్ద బుట్ట మోస్తూ, చేతిలో టిఫిన్ క్యారియర్ పట్టుకుని జీవనోపాధి కోసం కష్టపడే మహిళగా ఆమె లుక్ ఎంతో సహజంగా కనిపిస్తోంది. ఆకులు ఉపయోగించి విస్త‌రాకులు తయారు చేస్తూ జీవనం సాగించే సాధారణ మహిళగా ఆమె పాత్ర చిత్రీకరించబడింది. ఈ క్యారెక్ట‌ర్ కథలో కీలకంగా మారుతూ, సినిమా ప్రధాన సంఘర్షణకు బలమైన ఆధారంగా నిలుస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె కళ్లలో కనిపించే తీవ్రత, భావోద్వేగాలను ప్రతిబింబించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా కథ 1960ల ప్రారంభంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో సాగుతుంది. ఆ కాలం నాటి జీవన విధానాన్ని నిజమైన రీతిలో చూపించడానికి డైరెక్ట‌ర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. తన పాత్ర కోసం అనుపమ ప్రత్యేకంగా ఆ ప్రాంతపు భాషా శైలిని నేర్చుకోవడంతో పాటు, పాత్రలోని ఎమోష‌న్స్ ను లోతుగా అర్థం చేసుకుని నటించినట్లు తెలుస్తోంది. ఈ మార్పు ఆమె నటనా ప్రస్థానంలో ఒక కొత్త మలుపుగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంపత్ నంది కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమాలను ప్రేక్షకులకు దగ్గరగా తీసుకెళ్లడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత కే.కే. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే కీలకమైన యాక్షన్ సీన్స్ షూటింగ్ పూర్తయిందని, మిగిలిన షూటింగ్ వేగంగా కొనసాగుతోందని సమాచారం. మొత్తంగా భోగి ఒక పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కథలోని భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం, యాక్షన్ అంశాలు కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 28, 2026న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.