Begin typing your search above and press return to search.

చూపులతోనే హృదయాలు దోచుకుంటున్న అనుపమ!

అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్యకాలంలో ఏం చేసినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. టిల్లు స్క్వేర్ మూవీతో తన రూట్ మార్చిన ఈ ముద్దుగుమ్మ వరుస ఫోటోషూట్స్, వరుస సినిమాలతో ఊపు మీద ఉంది.

By:  Madhu Reddy   |   4 Oct 2025 2:00 PM IST
చూపులతోనే హృదయాలు దోచుకుంటున్న అనుపమ!
X

అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్యకాలంలో ఏం చేసినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. టిల్లు స్క్వేర్ మూవీతో తన రూట్ మార్చిన ఈ ముద్దుగుమ్మ వరుస ఫోటోషూట్స్, వరుస సినిమాలతో ఊపు మీద ఉంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్స్టా ఫోటోలతో మరోసారి స్పెషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. తాజాగా ఎల్లో కలర్ క్రాప్ టాప్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో గోల్డెన్ కలర్ టాప్ ఎల్లో కలర్ బాటమ్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

స్లీవ్ లెస్ గోల్డెన్ కలర్ టాప్ లో తళుక్కుమని మెరిసిపోతుంది.. అంతేకాదు చెవులకు పెద్ద చెవి దుద్దులను పెట్టి తన లుక్ లో చెవి దుద్దులనే హైలెట్ చేసింది. రింగుల జుట్టుతో మత్తెక్కించే కళ్ళతో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ హాట్ ఫోటోలను చూస్తే ఎవరైనా సరే అనుపమ అందానికి ఫిదా అవ్వాల్సిందే. అలా ఫోటోలతో కుర్రకారు గుండెల్లో మంట పెట్టిన అనుపమ పరమేశ్వరన్ ఇలాంటి ఫోటోల వల్లే సోషల్ మీడియాలో మరింత ఫేమస్ అవుతుంది. ముఖ్యంగా ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సాంప్రదాయమైన లుక్ తో అందరినీ కట్టిపడేసింది.

కానీ రాను రాను అందరిలాగే ఈ హీరోయిన్ కూడా తయారైంది అనేలా కొన్ని విమర్శలు ఎదుర్కుంది. ఎందుకంటే సినిమాల్లోకి వచ్చినా కొత్తలో అనుపమ పరమేశ్వరన్ ఒక్క సినిమాలో కూడా బోల్డ్ పాత్రలో నటించలేదు. పొట్టి బట్టలు వేసుకోలేదు. కానీ రౌడీ బాయ్స్ సినిమాతో రూట్ మార్చేసింది. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా నటించడంతోపాటు రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. దాంతో ఈ హీరోయిన్ ని ఇలాంటి పాత్రలో కూడా తీసుకోవచ్చని దర్శక నిర్మాతలకు ఓ క్లారిటీ వచ్చింది.

డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో మాత్రం పూర్తి బోల్డ్ గా కనిపించింది. పొట్టి పొట్టి బట్టలు వేయడంతో పాటు లిప్ లాక్ లతో రెచ్చిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అప్పటివరకు ఈ హీరోయిన్ ని అభిమానించిన అభిమానులు కూడా ఇదేంటి ఈ హీరోయిన్ ఇలా మారిపోయింది అని నోరెళ్లబెట్టి టిల్లు స్క్వేర్ సినిమాలో ఆమె పర్ఫామెన్స్ ను చూసి షాక్ అయిపోయారు.

అయితే అలాంటి అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత బోల్డ్ పాత్రలకు కూడా ఓకే చెప్పి మరిన్ని అవకాశాలు అందుకుంటుంది.అలా ఈ హీరోయిన్ టిల్లు స్క్వేర్ మూవీ తర్వాత పరదా అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో వచ్చింది. పరదా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీని ఎంచుకొని సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఈ సినిమాలో చూపించగా.. అందులో అద్భుతంగా నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత వెంటనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కిష్కింధపురి అనే మూవీ తో వచ్చి దెయ్యం పాత్రలో అందర్నీ భయపెట్టేసింది. అలా వరుస సినిమాలు చేస్తూ సౌత్ ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్న ఈ హీరోయిన్ చేతిలో ప్రస్తుతం ఎల్ క్లాసికో,ది పెట్ డిటెక్టివ్ అనే మలయాళ సినిమాలతో పాటు తెలుగులో భోగి, తమిళంలో బైసన్ అనే సినిమాలు ఉన్నాయి.