హీరోయిన్ ని చీట్ చేసిన టీచర్లు!
మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 30 Sept 2025 5:00 PM ISTమాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో రాని సక్సెస్ అమ్మడికి మీడియం రేంజ్ హీరోలతో రావడంతో? విజయవంతమైన ప్రయాణాన్ని కొనసా గిస్తోంది. ఇటీవలే `కిష్కిందపురి`తో మరో విజయం అందుకుంది. హారర్ థ్రిల్లర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో `బైసన్` తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా స్కూల్లో టీచర్లు తనను ఎలా మోసం చేసారో గుర్తు చేసుకుంది. అనుపమకు చిన్న నాటి నుంచి నటనంటే ఆసక్తి.
కానీ స్కూల్ టాపర్స్ కి మాత్రమే సినిమాల్లో అవకాశాలు వస్తాయి? అని తన టీచర్లు చెప్పేవారుట. బాగా చదివిన వాళ్లకే డైలాగులు చెప్పడం వస్తుందని..వాళ్లు మాత్రమే సినిమాల్లో రాణిస్తారని చెప్పేవారుట. ఆ మాటలను అనుపమ మనసులో ఆవయసులోనే బలంగా వెళ్లిపోయాయి. కానీ అనుపమ చదువులో వీక్. దీంతో తాను నటిగా పనికిరానని ఆ వయసులోనే నిర్ణయించుకుందిట. సరిగ్గా చదవలేని వాళ్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని బాధ పడిందిట. దీంతో నటించాలి అనే ఆలోచన మైండ్ లో నుంచి తొలగించిందిట. కానీ కాస్త ఊహ తెలిసాకే అసలు సత్యం బోధపడింది.
నటనకు..చదువుకు ఎంత మాత్రం సంబంధం లేదని గ్రహించినట్లు తెలిపింది. ఇంకా చెప్పాలంటే సరిగ్గా చదువురాని వాళ్లే సినిమాల్లో ఉంటారని ఇంకాస్త క్లారిటీ వచ్చిందంది. చిన్నప్పుడు టీచర్లు చెప్పిందంతా బాగా చదువుతారు ? అన్న కారణంతోనే అలా ప్రేరేపించేవారని తెలిపింది. ప్రస్తుతం అనుపమ తమిళ, మలయాళంలో సినిమాలు చేస్తోంది. `బైసన్`, `లాక్ డౌన్`, `పెట్ డిటెక్టివ్` లాంటి సినిమాల్లో నటిస్తోంది.
`కిష్కిందపురి`తో టాలీవుడ్ లో మరో సక్సెస్ అందుకున్న నేపథ్యంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేసిందన్న ప్రచారం ఉంది. కానీ అనుపమ వాటి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. దసరా సందర్భంగా చాలా సినిమాలు లాంచ్ అవుతాయి. మరి వాటిలో అనుపమ నటించే సినిమా ఏదైనా లాంచ్ అవుతుందా? అన్నది చూడాలి.` ప్రేమమ్` రీమేక్ తో అనుపమ టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే.
