Begin typing your search above and press return to search.

చీరకట్టులో చందమామలా కనిపిస్తున్న అనుపమ!

అనుపమ పరమేశ్వరన్.. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉండే ఈ ముద్దుగుమ్మ తన చీర కట్టుతో ఎంతోమందిని ఆకర్షించింది.

By:  Madhu Reddy   |   18 Sept 2025 4:00 AM IST
చీరకట్టులో చందమామలా కనిపిస్తున్న అనుపమ!
X

అనుపమ పరమేశ్వరన్.. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉండే ఈ ముద్దుగుమ్మ తన చీర కట్టుతో ఎంతోమందిని ఆకర్షించింది.సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అనుపమ పరమేశ్వరన్ అంటే ట్రెడిషనల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అనేలా ఉండేది. ఎందుకంటే లంగా వోణీలు,చుడీదార్ లు, చీర ఈ మూడు తప్ప వేరే లుక్ లో ఈ హీరోయిన్ కనిపించేది కాదు.కానీ సడన్ గా తన స్టైల్ మొత్తం చేంజ్ చేసింది. ఒక్కసారిగా ప్యాంటు,టీ షర్టు, చిట్టి పొట్టి స్కర్ట్ లు వేసి అందరు నోరెళ్లబెట్టుకొనేలా చేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా కిష్కింధపురి మూవీతో మనల్ని అలరించిన సంగతి మనకు తెలిసిందే.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన ఈ హార్రర్ ఫిలింలో అనుపమ దెయ్యంగా నటించి.. ఈ పాత్రలో కూడా చాలామందిని భయపెట్టించింది. ఈ సినిమాకు ముందు వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీ పరదాతో అందరి మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన విమర్శకులు సైతం అనుపమ యాక్టింగ్ ని ప్రశంసించారు.. అంతలా తన యాక్టింగ్ తో మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన కిష్కింధపురి మూవీ కూడా మొదటి రోజు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ మెల్లిమెల్లిగా కలెక్షన్లు పుంజుకొని హిట్ బాటలో పడింది.ఇక వెంట వెంటనే రెండు హిట్స్ రావడంతో అనుపమ పరమేశ్వరన్ మొహం నవ్వులతో వెలిగిపోతోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా ఖాతాలో చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ చీరకట్టులో అనుపమ ఎంతో అద్భుతంగా ఉంది అంటే ఆ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. ఖాదీ కాటన్ సారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని ఈ అనుపమ బాపు బొమ్మలా కనిపించింది.తన క్యూట్ స్మైల్ తో ఉన్న ఈ ఫొటోస్ అనుపమ అభిమానులకి మత్తెక్కిస్తున్నాయి. అలా చీర కట్టులో రకరకాల ఫోజులతో కెమెరాకి స్టిల్స్ ఇచ్చింది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ చీర కట్టుతో ఉన్న ఫోటోలకి కింద క్యాప్షన్ గా "నిన్నుక్కోరి వర్ణం"అనే సింబల్స్ తో క్యాప్షన్ ఇచ్చింది..

అనుపమ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా చాలామంది ఫ్యాన్స్ ఈ ఫోటోల కింద వైరల్ కామెంట్లు పెడుతున్నారు. అలా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ మరోసారి తన ఫోటోలతో అభిమానుల మనసు గెలుచుకుంది.ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే..పరదా, కిష్కింధపురి సినిమాలు హిట్ అవ్వడంతో ఈ హీరోయిన్ కి ఇండస్ట్రీలో మరింత క్రేజ్ పెరిగింది. అనుపమ చేతిలో బైసన్ అనే తమిళ మూవీ తో పాటు ది పెట్ డిటెక్టివ్,ఎల్ క్లాసికో అనే మలయాళ మూవీస్ ఉన్నాయి.