అనుపమ స్టేట్‌మెంట్‌కు స్టార్స్ స్పందన.. నిజాయితీకి ప్రశంసలు!
టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన పర్సనల్ లైఫ్, గతంలో ఒక రిలేషన్‌షిప్‌లో తాను పడిన మానసిక వేదన గురించి ఓపెన్‌గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
By: Madhu Reddy | 20 Aug 2026 11:00 PM ISTటాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన పర్సనల్ లైఫ్, గతంలో ఒక రిలేషన్‌షిప్‌లో తాను పడిన మానసిక వేదన గురించి ఓపెన్‌గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. మాజీ ప్రియుడితో ఉన్న బంధంలో దాదాపు రెండేళ్ల పాటు ఎంత ప్రాబ్లమ్ పేస్ చేసిందో తెలిపింది. ఇప్పుడు ఆమె ధైర్యంగా చెప్పడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై ఇతర హీరోయిన్లు స్పందిస్తూ అనుపమ చూపించిన ధైర్యాన్ని, నిజాయతీని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నారు.
ధైర్యంగా పంచుకున్న అనుపమ.. అదితి శంకర్ హ్యాట్సాఫ్:
ఓ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ శంకర్ కుమార్తె, నటి అదితి శంకర్ ఈ విషయంపై స్పందించారు. అనుపమ ఇంటర్వ్యూ తాను చూశానని, ఆమె మాటలపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు కానీ, తాను పడిన ఇబ్బందిని అంత ఓపెన్‌గా చెప్పినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలని అదితి అన్నారు. ఇక అనుపమ ఎవరినీ తక్కువ చేయడానికి ఈ విషయాలు చెప్పలేదని, కేవలం తన నిజాయతీగల అనుభవాన్ని మాత్రమే పంచుకున్నారని ఆమె తెలిపారు.
బాధను బయటకు చెప్పేందుకు ధైర్యం కావాలి:
అనుపమ మాటల్లో పూర్తి నిజాయతీ కనిపించిందని అదితి శంకర్ కొనియాడారు. మనసులోని బాధను, జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను నలుగురితో పంచుకోవడానికి ఎంతో గుండె ధైర్యం ఉండాలని చెప్పారు. ఇక అనుపమ చెప్పిన విషయాలు సమాజంలో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న చాలామందికి మంచి అవగాహన కలిగిస్తాయని, ఒక రకంగా స్పూర్తినిస్తాయని అదితి అభిప్రాయపడ్డారు.
అనుపమ మాటలు ఎంతోమందికి భరోసా: రాశి సింగ్:
మరో నటి రాశి సింగ్ కూడా అనుపమ పరమేశ్వరన్‌కి పూర్తి మద్దతుగా నిలిచారు. నేటి సమాజంలో చాలామంది అమ్మాయిలు రహస్యంగా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని రాశి అన్నారు. అనుపమ తన బాధను బయటకు చెప్పడం ద్వారా అలాంటి స్థితిలో ఉన్న ఎంతోమంది అమ్మాయిలకు ఒక పెద్ద భరోసానిచ్చారని, వారు కూడా ధైర్యంగా నిలబడటానికి ఇది సహాయపడుతుందని తెలిపారు.
అభిమానుల నుండి నీరాజనాలు:
కేవలం సెలబ్రిటీలే కాకుండా, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, అభిమానులు కూడా అనుపమకు పెద్ద ఎత్తున సపోర్ట్ ఇస్తున్నారు. ఇక గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా తన జీవితంలోని చీకటి కోణాన్ని దాచకుండా నిజాయతీగా మాట్లాడిన అనుపమ నిజమైన హీరో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమెకు తోడుగా ఉంటామంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
ఒక నటిగా కాకుండా ఒక సాధారణ మహిళగా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని నిర్భయంగా పంచుకున్న అనుపమ పరమేశ్వరన్‌ను అందరూ అభినందిస్తున్నారు. సినీ ప్రముఖులు అదితి శంకర్, రాశి సింగ్‌లతో పాటు తోటి నటీనటులు కూడా అనుపమ నిజాయతీకి జై కొడుతూ మద్దతుగా నిలవడం విశేషం.
