Begin typing your search above and press return to search.

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

ప్రముఖ మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   3 Nov 2026 12:52 PM IST
పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!
X

ప్రముఖ మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో.. అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ విపరీతమైన ప్రజాధారణ సొంతం చేసుకుంది . మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన ఈమె.. తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత, నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'అ ఆ' చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించి, తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన 'శతమానం భవతి' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అనుపమ.

ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా ఈమెకు పెద్దగా సక్సెస్ రాకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రీ ఎంట్రీలో భాగంగా గ్లామర్ తో ఆకట్టుకోవడమే కాకుండా బోల్డ్ పాత్రలు కూడా చేసి మెప్పించింది అనుపమ. అలాంటి ఈమె ఇటీవల కిష్కింధపురి, పరదా, బైసన్ వంటి చిత్రాలలో నటించింది. సాధారణంగా ఇన్ని రోజులు రూమర్స్ కి దూరంగా ఉన్న అనుపమ పరమేశ్వరన్.. బైసన్ సినిమా సమయంలోనే ఆ చిత్ర హీరో, ప్రముఖ హీరో కొడుకు, యంగ్ హీరోతో ప్రేమలో పడినట్లు, ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

అయితే ఆ రూమర్లపై అనుపమ పరమేశ్వరన్ స్పందించలేదు. కానీ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెండేళ్ల పాటు తాను టాక్సిక్ రిలేషన్ లో ఉన్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రేమ అంటే ఒకరి స్వతంత్రాన్ని లాగేసుకోవడం కాదు అని చెప్పిన అనుపమ.. రెండేళ్లపాటు తాను నరకం చూసానని చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను ప్రేమలో పడకముందు పెళ్లి చేసుకొని,చాలామంది పిల్లలను కణాలని కలలు కన్నట్లు చెప్పుకొచ్చిన ఈమె.. అతడితో రిలేషన్ బ్రేకప్ తర్వాత అసలు ప్రేమ, పెళ్లి , పిల్లలు అంటేనే భయమేస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

టాక్సిక్ రిలేషన్ నుండి బయటపడ్డానని చెప్పిన ఈమె.. ఇటీవలే క్రేజీ కల్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు మరోసారి శర్వానంద్ తో కలిసి భోగి సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. అనుపమ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే .. ఇటు ఖాళీ సమయం దొరికితే చాలు పలు రీల్స్ చేస్తూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది.

సూర్య, భూమిక కాంబినేషన్లో వచ్చిన నువ్వు నేను ప్రేమ సినిమాలోని "ప్రేమించే ప్రేమవా" అనే మ్యూజిక్ ను షేర్ చేస్తూ.. ఒక గేటు పట్టుకొని సరదాగా ఆ మ్యూజిక్ ని ఫీల్ అవుతున్నట్లు ఆ వీడియోని షేర్ చేసింది. పైగా ఈ వీడియోకి క్యాప్షన్ గా.."పదేళ్ల వయసులోనే నేను, సన్ మ్యూజిక్ కి అతుక్కుపోయి.. ఈ పాటను పదేపదే వింటూ ప్రేమ, శృంగారం ఎలా ఉంటాయో ఊహించుకొనే దాన్ని" అంటూ చెప్పుకొచ్చింది . మొత్తానికైతే ఈ క్యాప్షన్ కాస్త వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్స్.. పదేళ్ల వయసులోనే ఎన్నో ఊహించుకున్న ఈమె.. ఇప్పుడు యుక్త వయసుకు వచ్చాక అతడి కారణంగా ప్రేమ అంటేనే భయపడే స్టేజ్ కి చేరుకుందా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అనుపమ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.