Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 10 ఏళ్ల తర్వాత..!

మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ ప్రేమమ్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి సరిగ్గా దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది.

By:  Ramesh Palla   |   18 Oct 2025 10:27 AM IST
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 10 ఏళ్ల తర్వాత..!
X

మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ ప్రేమమ్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి సరిగ్గా దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది. సాధారణంగా హీరోయిన్స్ అయిదు పది ఏళ్లకే కనుమరుగు కావడం మనం చూస్తున్నాం. అతి కొద్ది మంది మాత్రమే పదేళ్ల తర్వాత కూడా కొనసాగుతూ వస్తున్నారు. ఆ కొద్ది మంది జాబితాలో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ చేరింది. మలయాళ ప్రేమమ్‌ సినిమా విడుదల అయ్యి పదేళ్లు పూర్తి అయింది, ఈ పదేళ్ల కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న అనుపమ ఇంకా కూడా బిజీ బిజీగానే సినిమాలను చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తనకు దక్కిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్న అనుపమ పరమేశ్వరన్‌ ఇప్పుడు సౌత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా నిలిచింది.

ప్రేమమ్‌ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ

అనుపమ పరమేశ్వరన్‌ ప్రస్తుతం చేతిలో మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. విశేషం ఏంటంటే ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో అనుపమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డ్రాగన్ సినిమాతో ఈ ఏడాదిని ఆరంభించిన అనుపమ పరమేశ్వరన్‌ మంచి పేరును సొంతం చేసుకుంది. ఆ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకుంది. ఆ సినిమా తమిళ్‌లో రూపొంది తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత జానకీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్ కేరళ సినిమాతో వచ్చింది. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలను అనుపమ దక్కించుకుంది. ఆ తర్వాత పరదా, కిష్కిందాపురి సినిమాలతోనూ వచ్చింది. ఈ ఏడాదిలో నాలుగు సినిమాలు చేసిన అనుపమ మరో రెండు సినిమాలతో రాబోతుంది.

అనుపమ పరమేశ్వరన్‌ బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌

అతి త్వరలోనే మలయాళ మూవీ ది పెట్‌ డిటెక్టివ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ఫలితంపై మేకర్స్ చాలా కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ నటనకు మంచి మార్కులు పడుతాయి అనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. అనుపమ ముందు బైసన్ అనే మరో భారీ సినిమా ఉంది. తమిళ్‌లో రూపొందిన ఆ సినిమాను ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అనుపమ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాదిలో భారీ బడ్జెట్‌ సినిమాలు, లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో అనుపమ రావడం ద్వారా మంచి పేరు సొంతం చేసుకుంది. హీరోయిన్‌గా అనుపమ కి ఈ ఏడాది మంచి పేరును తెచ్చి పెట్టింది.

లాక్‌డౌన్ సినిమాతో వచ్చే ఏడాది...

వచ్చే ఏడాది ఆరంభంలోనే లాక్‌డౌన్‌ సినిమాతోనూ వచ్చేందుకు అనుపమ రెడీ అవుతోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పదేళ్ల తర్వాత ఏడాదికి ఆరు సినిమాలతో రావడం అనేది చాలా పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం అనుపమ రికార్డ్‌ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. గత ఏడాది మూడు సినిమాలతో వచ్చిన అనుపమ ఈసారి ఏకంగా ఆరు సినిమాలతో వచ్చింది. వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో ఆమె సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క సినిమాల జోరు చూసి చాలా మంది హీరోయిన్స్‌ ఆశ్చర్యపోతూ ఉంటారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరో పదేళ్ల పాటు అనుపమ ఇదే స్థాయిలో సినిమాలు చేయాలని అభిమానులు, ఆమె సన్నిహితులు కోరుకుంటున్నారు.