కర్లీ కళ్యాణి అందాలు చూశారా?
అనుపమ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ, మలయాళం సినిమాలలో నటిస్తూ తనకంటూ ఒక మంచి ఇమేజ్ అందుకుంది.
By: Madhu Reddy | 23 Jan 2026 12:40 PM ISTప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో.. అందంతో.. అందరినీ ఆకర్షించే ఈ ముద్దుగుమ్మ.. తన కర్లీ జుట్టుతో కూడా అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే తన కర్లీ హెయిర్ తో ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఈమె.. తాజాగా వీటిని ప్రధానంగా చేసుకొని ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందమైన కర్లీ జుట్టును కలిగివున్న అనుపమ పరమేశ్వరన్ వైట్ డ్రెస్ ధరించి తన అందాలతో ఆకట్టుకుంది. కాటుక కళ్ళతో అభిమానులను మాయ చేస్తున్న ఈమె.. ఈ ఫోటోలను షేర్ చేస్తూ కర్లీ కళ్యాణి అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కర్లీ కళ్యాణి అందానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అనుపమ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ, మలయాళం సినిమాలలో నటిస్తూ తనకంటూ ఒక మంచి ఇమేజ్ అందుకుంది. తొలి చిత్రం 'ప్రేమమ్' ద్వారా మలయాళం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇందులో మేరీ జార్జ్ అనే పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ - సమంత జంటగా నటించిన 'అ ఆ' అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి , తన నటనతో డైలాగ్స్ తో అందరి దృష్టిలో పడింది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈమె మాతృభాష మలయాళం అయినప్పటికీ.. తన తొలి తెలుగు సినిమా అ ఆ కోసం సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం 'శతమానం భవతి' సినిమాలో నిత్య పాత్రతో మరింత పేరు సొంతం చేసుకుంది.
తెలుగులోనే కాకుండా తమిళ్లో ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా 'కోడి' లో నటించి తొలిసారి తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా వరుస చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ కి 2025 సంవత్సరం భారీగా కలిసి వచ్చింది అని చెప్పాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన 'కిష్కింధపురి' సినిమాలో దెయ్యం పాత్రలో అందరిని బెదరగొట్టేసింది. ఆ తర్వాత వచ్చిన ' పరదా' లేడీ ఓరియంటెడ్ మూవీ.. ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత 'బైసన్' అనే సినిమాలో నటించి, మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించారు. ఇకపోతే ఈ సినిమా సమయంలో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు రాగా.. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇలా పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
