Begin typing your search above and press return to search.

పాత్రలు మారితే రూల్స్ మారుతాయా?

టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల తార అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ క్రిప్టిక్ పోస్ట్ చర్చనీయాంశమైంది.

By:  Srikanth Kontham   |   31 Oct 2026 9:15 PM IST
పాత్రలు మారితే రూల్స్ మారుతాయా?
X

టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల తార అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ క్రిప్టిక్ పోస్ట్ చర్చనీయాంశమైంది. సమాజంలో .. చిత్ర పరిశ్రమలో వ్యక్తుల పట్ల వ్యక్తమవుతున్న ద్వంద్వ ప్రమాదాలు .. ప్రవర్తనా తీరుపై అమ్మ‌డు పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరినైనా ఒకే రకమైన విషయాల కోసం నిందించే సమాజం.. వేరే వ్యక్తులు అదే పని చేసినప్పుడు మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకుంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా పంచుకున్న నోట్‌లో ఒకప్పుడు చేసిన కొన్ని పనులకే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని.. కానీ కాలం మారి పరిస్థితులు తలక్రిందులైనప్పుడు వేరేవారు అవే పనులు చేస్తే మాత్రం అందరూ దాన్ని సాధారణంగా తీసుకున్నారని అనుపమ పేర్కొన్నారు.





`ఒకప్పుడు మిమ్మల్ని ఎందుకైతే తప్పుబట్టి దోషిగా నిలబెట్టారో? పరిస్థితులు మారిన తర్వాత అవే విషయాలు పూర్తిగా సాధారణమైపోతాయి` అంటూ అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. చిన్న చిన్న విషయాల్లో ఆనందం పంచుకోవడం, ఇష్టమైన వారిని ప్ర‌శంసించ‌డం వంటి సాధారణ చర్యలను కూడా కొందరు అనవసర విమర్శలకు గురిచేస్తారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అనుప‌మ‌ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో హైలైట్‌గా నిలిచాయి.

`ఇది అసలు మీరు ఏం చేశారనేది కాదు. ఆ పని చేయడానికి అసలు ఎవరికి అనుమతి ఉంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది` అంటూ రాసుకొచ్చిన వాక్యం నెట్టింట వైరల్ అవుతోంది. సెలబ్రిటీల జీవితాలను సోషల్ మీడియాలో చూసి మాత్రమే అంచనా వేసే వారికి ఈ వ్యాఖ్యలు కౌంటర్‌గా ఉన్నాయని అభిమానులు అభిప్రా యపడుతున్నారు. తెరవెనుక జరిగే పరిణామాలు తెలియకుండా పైకి కనిపించే దృశ్యాలను బట్టి జ‌డ్జిమెంట్ పాస్ చేయడం సరికాదని పరోక్షంగా హితవు పలికారు. అనుప‌మ‌ సోషల్ మీడియా ప్రవర్తన గురించి స్పందిస్తూ.. అభిమానులతో ..తోటివారితో ఇంటరాక్ట్ అవ్వడం త‌న‌కు మొదటి నుంచీ ఇష్టమని అది ఇప్పుడే? మొదలుపెట్టిన అలవాటు కాదని స్పష్టం చేశారు.

అయితే సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ పేరుతో వ్యక్తిగత ప్రశాంతతను కోల్పో వడానికి మాత్రం సిద్ధంగా లేనన్నారు. వర్చువల్ ప్రపంచానికి అతీతంగా నిజ జీవితంలో ఎన్నో బాధ్యతలు, పోరాటాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ తమ భావాలను సోషల్ మీడియాలో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రేమ, కృతజ్ఞత వంటి భావాలను నిత్యం ప్రదర్శిస్తూ నిరూపించుకోవాల్సిన పని లేదని అవి నిజమైనవని నిరూపించడానికి ప్రదర్శనలు అక్కర్లేదని అనుపమ పేర్కొన్నారు. ఎప్పుడైతే పాత్రలు మారుతాయో? అప్పుడే నిబంధనలు కూడా ఎలా మారిపోతాయో ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానిస్తూ పోస్ట్‌ను ముగించారు. ఏదేమైనా? సమాజంలో వ్యక్తుల పట్ల ఉండే పక్షపాత వైఖరిని.. డబుల్ స్టాండర్డ్స్‌ను ఎత్తిచూపుతూ అనుపమ పరమేశ్వరన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.