Begin typing your search above and press return to search.

'క్రేజీ కళ్యాణం' టీజర్.. తెలంగాణ స్టైల్ లో మరో డిఫరెంట్ మూవీ

పక్కా గ్రామీణ నేపథ్యంలో ఒక పెళ్లి చుట్టూ తిరిగే హంగామాను ఈ టీజర్ లో చాలా ఫన్నీగా ప్రెజెంట్ చేశారు.

By:  M Prashanth   |   1 Aug 2026 1:48 PM IST
క్రేజీ కళ్యాణం టీజర్.. తెలంగాణ స్టైల్ లో మరో డిఫరెంట్ మూవీ
X

రీసెంట్ గా టైటిల్ పోస్టర్ తో కాస్త బజ్ క్రియేట్ చేసిన 'క్రేజీ కళ్యాణం' సినిమా టీజర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, నరేష్ మెయిన్ లీడ్స్ లో నటిస్తున్న ఈ సినిమాను బద్రప్ప గాజుల డైరెక్ట్ చేస్తున్నారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో ఒక పెళ్లి చుట్టూ తిరిగే హంగామాను ఈ టీజర్ లో చాలా ఫన్నీగా ప్రెజెంట్ చేశారు. విలేజ్ లో జరిగే పెళ్లిళ్లు, అక్కడ వచ్చే చిన్న చిన్న గొడవలను బేస్ చేసుకుని ఈ కామెడీ డ్రామాను ప్లాన్ చేసినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతోంది.

టీజర్ స్టార్టింగ్ లోనే నరేష్ తన కూతురైన అనుపమ పెళ్లి గురించి ప్లాన్ చేస్తూ "చెప్పు బిడ్డా ఎట్లా చేయాలి నీ పెళ్లి.. ఎంత బంగారం కావాలి.. ఎన్ని చీరలు కావాలన్నా కొనుక్కో.. నీ దోస్తులనందరినీ పిలుచుకో" అంటూ చాలా సరదాగా మాట్లాడే డైలాగ్ తో ఫన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అనుపమ ఇంగ్లీష్ లో కూడా బాగా మాట్లాడుతుందని నరేష్ చెప్పగా.. "ఓ మై గాడ్ ఓ" అంటూ అనుపమ ఇచ్చే ఎక్స్ ప్రెషన్ చాలా నాచురల్ గా నవ్విస్తుంది.

ఫస్ట్ హాఫ్ లో కాస్త సాఫ్ట్ గా సాగిన ఈ ఫ్యామిలీ కాన్ఫిక్స్, నెక్స్ట్ సీన్స్ లో కంప్లీట్ మాస్ పెళ్లి రచ్చగా మారుతుంది. టీజర్ మధ్యలో వచ్చే క్యారెక్టర్ల గొడవలు, పెళ్లి భోజనాల దగ్గర జరిగే ఫైట్స్ విలేజ్ కల్చర్ ని గుర్తుచేస్తాయి. ఒక సీన్ లో తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ "ఏ ఫ్యామిలీలు రా నా నాయన.. బతకనీయ్యరు చావనీయ్యరు" అంటూ తెగ ఇబ్బంది పడిపోయే డైలాగ్ నేటి జనరేషన్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

అలాగే "నీ కొడుకే మొండోడు అనుకుంటున్నావేమో.. నాలో కూడా ఆయన రక్తమే ప్రవహిస్తుంది" అంటూ అనుపమ చెప్పే ఇంటెన్స్ డైలాగ్ కూడా సినిమాలో ఎమోషన్ ఏ రేంజ్ లో ఉండబోతోందో హింట్ ఇస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విలేజ్ పెళ్లికి కావాల్సిన పక్కా నాటు బీట్ లతో టీజర్ ని బాగా ఎలివేట్ చేశాయి. ఆరో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ లో ఊహించని పెద్ద ట్విస్టులు లేకపోయినప్పటికీ, క్లీన్ విలేజ్ కామెడీని ఇష్టపడే ఆడియన్స్ ని సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ ఉన్నాయని అనిపిస్తోంది.

క్యారెక్టర్ల మధ్య ఉండే ఈ ఫన్ డ్రామా థియేటర్లలో ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక 'క్రేజీ కళ్యాణం' టీజర్ లో అనవసరమైన డ్రామా లేకుండా ఒక పల్లెటూరి పెళ్లి వాతావరణాన్ని, అక్కడ జరిగే ఈగో క్లాషెస్ ని క్లియర్ గా చూపించారు. ప్రమోషన్స్ పరంగా ఈ మొదటి అప్డేట్ సినిమాపై పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసేలా ఉంది.