అనుపమ మేడం.. మీరు గ్రేట్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా ఎక్కువ మంది ఇతర భాషల హీరోయిన్స్ ఉన్నారు.
By: Ramesh Palla | 26 Oct 2026 4:24 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా ఎక్కువ మంది ఇతర భాషల హీరోయిన్స్ ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ జాబితా తీస్తే అందులో మొత్తం ఇతర భాషలకు చెందిన వారే ఉంటారు. ఈమధ్య కాలంలో ఇద్దరు ముగ్గురు తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని, హీరోయిన్స్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్స్ లో ఎక్కువ శాతం మంది సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేక పోతున్నారు. కేవలం యాక్టింగ్ చేసి వారు వెళ్తే, వారికి మళ్లీ వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. అలా చేస్తే సోల్ మిస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరికి డబ్బింగ్ సెట్ అవుతుంది, కానీ కొందరు హీరోయిన్స్‌కి ఇతరులతో చెప్పించే డబ్బింగ్ అస్సలు సెట్ కాదు. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో, తెలుగు రాకపోవడం వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్‌లపై ఆధారపడాల్సి వస్తుంది.
భోగి సినిమా కోసం అనుపమ డబ్బింగ్...
సాయి పల్లవితో పాటు మరికొందరు హీరోయిన్స్ మాత్రం ఏ భాషలో సినిమా చేసినా, ఆ భాషను నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్తున్నారు. అందులో అనుపమ పరమేశ్వరన్ కూడా ముందు ఉంటుంది. ఈమె తెలుగులో చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలకు సొంత డబ్బింగ్ చెప్పుకుంది. మొదటి సినిమా 'అఆ' నుంచే తాను సొంత డబ్బింగ్ మొదలు పెట్టింది, ప్రేమమ్ సినిమాలో కూడా అనుపమ్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. నార్మల్ తెలుగు భాష అయితే పర్వాలేదు కానీ కాస్త యాస, అది కూడా పల్లెటూరు యాస, మాస్ జనాలు మాట్లాడుకునే ప్రాసలో మాట్లాడటం అనేది చాలా కష్టం. కానీ అనుపమ మాత్రం తన తాజా చిత్రం కోసం చాలా కష్టపడి యాసతో కూడా మాస్ భాష తో డబ్బింగ్ చెప్పింది. శర్వానంద్ హీరోగా రూపొందిన 'భోగి' సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ డబ్బింగ్ పూర్తి చేసింది. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో...
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కె కె రాధామోహన్ నిర్మించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో అనుపమ పరమేశ్వరన్‌ను కందుల సులోచన రాణి అనే పాత్రలో చూడబోతున్నాం. ఇప్పటికే ఆమె లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. తెలుగు సినిమాలో ఒక హీరోయిన్ పాత్ర మరీ ఇంత రస్టిక్‌గా ఉంటుందా అని షాక్ అయ్యారు. వీరి కాంబోలో గతంలో వచ్చిన శతమానం భవతి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమాతో మరో విజయాన్ని ఈ కాంబినేషన్ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భోగి పేరు పెట్టుకుని సంక్రాంతికి ముందే రాబోతున్న ఈ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ నటిగా మంచి మార్కులు దక్కించుకోవడం ఖాయం అని అంతా చాలా నమ్మకంగా చెబుతున్నారు. తాజాగా డబ్బింగ్ పూర్తి చేసిన సందర్భంగా విడుదలైన వీడియోలో చాలా మాస్‌గా అనుపమ పరమేశ్వరన్ డైలాగ్ చెప్పడం చూస్తూ ఉంటే తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా ఈ సినిమా నిలవడం ఖాయం అనిపిస్తుంది.
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ భోగి రిలీజ్ డేట్...
హీరోయిన్స్ సాధారణంగా డబ్బింగ్ చెప్పడానికి కిందా మీదా పడుతున్నారు. బాష వచ్చినా కూడా సన్నివేశాలకు తగ్గట్లుగా డైలాగ్స్ చెబుతూ డబ్బింగ్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది భాష పెద్దగా రాదు, పైగా పల్లెటూరు యాస అయినప్పటికీ అనుపమ డబ్బింగ్ పూర్తి చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో అనుపమ భోగి సినిమాకు సంబంధించిన వీడియో ను షేర్ చేయడంతో చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అనుపమ మేడం మీరు చాలా గ్రేట్, అంత రస్ట్ యాసను కూడా చాలా ఈజీగా చెప్పడం చూస్తూ ఉంటే మీరు సినిమాలో మరో లెవల్ లో కనిపించబోతున్నారు అనిపిస్తుందని, భోగి సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే భోగి సినిమా సందడి మొదలైంది. అనుపమ డబ్బింగ్ పూర్తి వీడియోతో ఆ సందడి మరింత పెరిగింది. నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో శర్వానంద్, అనుపమ జోడీ మరో హిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందా అనేది చూడాలి.
