అనుపమకు అలా అనడం నచ్చలేదా?
ఏ భాషలోనైనా నాయికల ప్రాధాన్యత విషయంలో ఈ లైనప్ కనిపిస్తుంది. అయితే నాయికల్ని ఇలా డివైడ్ చేయడంపై నటి అనుపమ పరమేశ్వరన్ కు నచ్చనట్లు కనిపిస్తోంది.
By: Srikanth Kontham | 22 Nov 2025 6:00 PM ISTకథ, పాత్రలను బట్టి ఒక సినిమాకు ఒక్కోసారి నలుగురు హీరోయిన్లు కూడా మేకర్స్ ఎంపిక చేస్తుంటారు.ఎంత మంది భామలున్నా? పాత్రలకంటూ కొంత ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ లీడ్..సెకెండ్ లీడ్..థర్డ్ లీడ్ గా డివైడ్ అవుతుంటాయి. సినిమాలో ముఖ్య నాయిక ఒకరు హైలైట్ అవుతారు. ఆ పాత్ర ఆరంభం నుంచి ముగింపు వరకూ హీరోతో పాటు ట్రావెల్ అవుతుంది. ఏ భాషలోనైనా నాయికల ప్రాధాన్యత విషయంలో ఈ లైనప్ కనిపిస్తుంది. అయితే నాయికల్ని ఇలా డివైడ్ చేయడంపై నటి అనుపమ పరమేశ్వరన్ కు నచ్చనట్లు కనిపిస్తోంది.
పాత్రలో బలమే కీలకం:
ఫస్ట్ లీడ్..సెకెండ్ లీడ్ అంటూ పిలవడం తనకు ఎంత మాత్రం నచ్చలేదంది. ఈ మద్య కాలంలో ఈ పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయంది. అవసరం లేని పదాలు అనవసరంగా వేస్తున్నారంది. ` ప్రేమమ్ లో సాయిపల్లవి, మడోన్నా, నేను నటించాం. ముగ్గురు ఎవరి పాత్రలు వారు పోషించాం. మూడు కథకు సమానమైన పాత్రలే. వాటిలో ఫస్ట్ లీడ్..సెకెండ్ లీడ్ ఎలా సపరేట్ చేయగలరు? నిజంగా ముఖ్యమైంది పాత్రలో బలం మాత్రమే. పాత్రల నిడివి కి కూడా ప్రాధన్యత ఇవ్వాల్సిన పనిలేదని అభిప్రాయపడింది. మరి ఈ వ్యాఖ్యలపై మిగతా భామలు ఏమంటారో చూద్దాం. ఈ బ్యూటీ సౌత్ లో అన్ని భాషల్ని చుట్టేసింది.
స్టార్ లీగ్ కి దూరంగానే కెరీర్:
మాలీవుడ్ లో పరిచయమైన అమ్మడు అటుపై తమిళ్ లో లాంచ్ అయింది. అక్కడ నుంచి తెలుగు సినిమాలకు ప్రమోట్ అయింది. అనుపమ అందం, అభినయానికి పెద్ద హీరోయిన్ అవుతుందనుకున్నారంతా? కానీ కాలం కలిసి రాలేదు. స్టార్ లీగ్ లో చేరలేకపోయింది. కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించగా? మరికొన్ని చిత్రాల్లో సెకెండ్ లీడ్స్ పోషించింది. అమ్మడి కెరీర్ మొత్తంగా చూస్తే సెకెండ్ లీడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు కూడా పోషించింది. ఓ రకంగా హీరోయిన్ గా రాని గుర్తింపు అమ్మడికి సెకెండ్ లీడ్స్ తీసుకొచ్చాయి.
2025లో ఆరు రిలీజ్ లతో:
అవకాశాలు లేని సమయంలో? డిఫరెంట్ జానర్ చిత్రాలు అనుపమను ఆదుకున్నాయి. ఆరంభంలో గ్లామర్ పాత్రలకు నో చెప్పడంతో కెరీర్ పరంగా స్లో అయింది. కానీ ఆ విషయాన్ని కొన్నేళ్లకు గానీ గమనించలేకపోయింది. లక్కీగా అప్పటికి ఇండస్ట్రీలో ఉండటంతో సెకెండ్ ఛాన్స్ దక్కింది. ఈ ఏడాది ఇప్పటికే ఆరేడు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించింది. `డ్రాగన్`, `కిష్కిందపురి`, `బైసన్` లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. `జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ`లో అనుపమ పాత్రకు మంచి పేరొచ్చింది.
