ఈ సారైనా అనుపమ కోరిక తీరుతుందా?
ఒక సక్సెస్ జీవితాన్నే మార్చేస్తుంది. ఈ మాట ఎవరూ ఊరికే అనలేదు. సెలబ్రిటీలకు కూడా ఇది మినహాయింపేమీ కాదు.
By: Sravani Lakshmi Srungarapu | 12 Sept 2025 11:15 AM ISTఒక సక్సెస్ జీవితాన్నే మార్చేస్తుంది. ఈ మాట ఎవరూ ఊరికే అనలేదు. సెలబ్రిటీలకు కూడా ఇది మినహాయింపేమీ కాదు. ఒక సినిమా సక్సెస్ అయితే దాని తాలూకా క్రేజ్ తో ఎన్నో అవకాశాలొచ్చి, దాని ద్వారా కెరీర్లో ముందుకు వెళ్లే అవకాశం దక్కుతుంది. అందుకే ఏ కారణంతోనైనా, ఎవరికైనా అల్టిమేట్ గా కావాల్సింది సక్సెస్ మాత్రమే. ఆ సక్సెస్ కోసం సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఎంతో కష్టపడుతూ ఉంటారు.
అనుపమ టార్గెట్ టాలీవుడ్..
కొన్నిసార్లు వారి కష్టానికి తగ్గ ప్రతిఫలమొస్తే మరికొన్ని సార్లు వారు ఆశించని ఫలితం రాకుండా నిరాశ ఎదురవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. అమ్మడు ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలైతే చేస్తున్నారు కానీ తన టార్గెట్ మాత్రం మొత్తం టాలీవుడ్ పైనే ఉంది. కానీ అనుపమ మరికొన్నాళ్ల పాటూ టాలీవుడ్ లో కంటిన్యూ అవాలంటే ఆమెకు అర్జెంటుగా తెలుగులో ఓ సక్సెస్ కావాలి.
టిల్లూ స్క్వేర్ సక్సెస్‌ను వాడుకోలేకపోయిన అనుపమ
ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకున్న అనుపమకు ఇప్పుడు హిట్ తప్పనిసరి. సిద్దు జొన్నలగడ్డతో కలిసి చేసిన టిల్లు స్క్వేర్ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ అనుపమ ఆ హిట్ ను సరిగా వాడుకోలేకపోయింది. రీసెంట్ గా ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకుని చేసిన పరదా సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించలేక పోయింది. దీంతో ఇప్పుడు తన ఆశలన్నింటినీ అనుపమ కిష్కింధపురి పైనే పెట్టుకుంది.
కీలకంగా మారిన కిష్కింధపురి రిజల్ట్
కిష్కింధపురి రూపంలో అనుపమకు మంచి సక్సెస్ దక్కితే టాలీవుడ్ లో అమ్మడికి మరిన్ని అవకాశాలొచ్చే వీలుంది. ప్రస్తుతం అనుపమ చేతిలో ఏ తెలుగు సినిమా లేదు. తమిళ, మలయాళ సినిమాలు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. ఒకవేళ కిష్కింధపురితో కూడా అనుపమకు బ్రేక్ దక్కకపోతే ఇక అమ్మడు వేరే భాషలకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనుపమకు కిష్కింధపురి సక్సెస్ కీలకంగా మారింది. ఈ సినిమాలో అనుకి మంచి క్యారెక్టర్ దక్కిందంటున్నారు మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
