స్టార్ హీరో కొడుకుతో అనుపమ డేటింగ్.. సమాధానం ఇదేనా?
అనుపమ తమిళంలో తాజాగా చేసిన సినిమా బైసన్. ఇందులో అనుపమ హీరోయిన్ కాగా.. చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించారు.
By: M Prashanth | 10 Oct 2025 7:00 PM ISTమలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 10ఏళ్లు కావస్తోంది. ప్రేమమ్ తో కెరీర్ ప్రారంభించిన అనపమ.. ఆ తర్వాత పలు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది. ఫలితాలతో సంబంధం లేకుండా అనేక సినిమాల్లో నటించింది. ఆమె అందం, కర్లీ హెయిర్, మోహంలో క్యూట్ నెస్ కు కుర్రకారు ఫిదా అయిపోయారు. తమ క్రష్ లిస్ట్ లో జాయిన్ చేసుకున్నారు.
అయితే సెలబ్రిటీలు అన్నాక.. వాళ్లపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇక వాళ్ల పర్సనల్ లైఫ్ విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఎంతగానో ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే వాళ్లపై పలు రకాల రూమర్స్ కూడా పుట్టుకొస్తాయి. ముఖ్యంగా అది హీరో అయినా, హీరోయిన్ అయినా వాళ్ల పెళ్లి, లవ్, రిలేషన్ షిప్ గురించే ఎక్కువ ప్రచారం జరుగుతుంటుంది.
దీనికి అనుపమ మినహాయింపేమీ కాదు. గతంలో నుంచే అనుపమ పెళ్లి, రిలేషన్ షిప్ అంటూ అనేకసార్లు ప్రచారం సాగింది. తాజాగా మరోసారి ఈ ప్రచారం జోరందుకుంది. దీనికి కారణం ఆమె ప్రస్తుతం తమిళంలో చేస్తున్న సినిమా. అనుపమ తమిళంలో తాజాగా చేసిన సినిమా బైసన్. ఇందులో అనుపమ హీరోయిన్ కాగా.. చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించారు. ఇది లవ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది.
కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలో అనుపమ- ధ్రువ్ మధ్య ఫ్రెండ్ షిప్ బాండింగ్ ఏర్పడింది. అప్పట్నుంచి ఇద్దరూ క్లోజ్ గా ఉంటున్నారని, ఈ ఇధ్దరూ రిలేషన్ షిప్లో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. అయితే దీనిపై మీడియా డైరెక్ట్ గా అనుపమనే ప్రశ్నించింది. బైసన్ ప్రమోషన్స లో రీసెంట్ గా పాల్గొన్న అనుపమకు డేటింగ్ రూమర్స్ గురించి అడిగారు.
ఈ ప్రశ్న నుంచి అనుపమ తెలివిగా తప్పించుకుంది. దీనికి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ.. అందుకు బదులుగా బైసన్ సినిమాలో ధ్రువ్ నటన, డెడికేషన్ గురించి చెబుతూ ప్రశంసలు కురిపించింది. దీంతో అనుపమ తెలివిగా సమాధానం చెప్పిందని కొందరు అనగా.. మరికొందరూ నిజంగా డేటింగ్ లో ఉందా అని ఆరా తీస్తున్నారు. ఏదేమైనా దీని గురించి ఆ ఇద్దరే చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే ఓ క్లారిటీ వస్తుంది.
