Begin typing your search above and press return to search.

ఆడ‌? మ‌గా తెలియ‌క క‌న్య్పూజ్ అయిన న‌టుడు!

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ విల‌క్ష‌ణ ప్ర‌ద‌ర్శ‌న గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   11 Aug 2025 3:23 PM IST
ఆడ‌? మ‌గా తెలియ‌క క‌న్య్పూజ్ అయిన న‌టుడు!
X

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ విల‌క్ష‌ణ ప్ర‌ద‌ర్శ‌న గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో బాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకున్నారు. రేర్ గా ఇత‌ర భాష‌ల్లో కూడా న‌టిస్తుంటారు. తెలుగులోనూ నాలుగైదు సినిమాలు చేసారు. 80వ ద‌శ‌కంలోనే 'త్రిమూర్తులు' అనే సినిమాలో న‌టించారు. కానీ ఆ త‌ర్వాత తెలుగులో కొన‌సాగ‌లేదు. మ‌ళ్లీ చాలా కాలానికి `కార్తికేయ 2` తో కంబ్యాక్ అయ్యారు. అటుపై 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు', 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' లాంటి చిత్రాల్లో న‌టించారు.

యువ హీరో నికిల్ హీరోగా న‌టిస్తోన్న `ది ఇండియా హౌస్` లో కూడా న‌టిస్తున్నారు. డైరెక్ట‌ర్ గా కూడా కొన్ని సినిమాలు చేసారు. `త‌న్వీ ది గ్రేట్` ఆయ‌న స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. ఇటీవ‌లే ఆ చిత్రం రిలీజ్ అయింది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే? తాజాగా అనుప‌మ్ ఖేర్ టాయిలెట్ ద‌గ్గ‌ర ఎదుర్కొన్న ఓ అనుభ‌వాన్ని గుర్తు చేసుకున్నారు. టాయిలెట్ ప్ర‌దేశాల్లో బ‌య‌ట ఉండే ఆడ -మ‌గ గుర్తుల‌ను చూసి ఏ గుర్తు పురుషుడ‌ని సూచిస్తుందో? ఏది స్త్రీ గుర్తును సూచిస్తుందో? తెలియ‌క క‌న్య్పూజ్ అయిన‌ట్లు తెలిపారు.

ఇలా మీరు కూడా ఎప్పుడైనా గంద‌ర‌గోళానికి గుర‌య్యారా? అని నెటిజ‌నుల్ని అడిగారు. వాష్ రూమ్స్ వ‌ద్ద జెంట్స్ అని...లేడీస్ అని రాస్తే స‌రిపోతుంది? కానీ వాళ్లు బొమ్మ గుర్తులేస్తారు. అందులో ఎవ‌రు మేల్-ఎవ‌రు? ఫీమేల్ అన్న‌ది అర్దం కాదు. గ‌తంలో ఉన్న‌ట్లు ఎందుకు స‌ర‌ళంగా ఉండ‌కూడ‌దు? అన్నారు. ఇదంతా చెప్పుకోవ‌డానికి స‌ర‌దా మ్యాట‌ర్ లా ఉన్నా? దీనిలో సీరియ‌స్ నెస్ అలా క‌న్ప్యూజ్ అయిన వాళ్ల‌కే తెలుస్తుంద‌న్నారు. దీనికి సంబంధించి అనుప‌మ్ ఖేర్ ఇన్ స్టాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేసారు.

ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. అనుప‌మ్ షేర్ చేసిన బొమ్మ‌లు చూస్తుంటే? ఆయ‌న చెప్పింది నిజ‌మేన‌ని నెటి జ‌నులు పోస్టులు పెడుతున్నారు. గ‌తంలో తాము ఎదుర్కున్న అనుభ‌వాల‌ను కూడా నెటి జ‌నులు షేర్ చేసుకుంటున్నారు. గోడ‌ల‌పై వేసిన ఆడ‌-మ‌గ‌ బొమ్మ‌ల్లో ఎంత మాత్రం క్లారిటీ ఉండ‌టం లేద‌ని అభి ప్రాయప‌డుతున్నారు.