పాన్ ఇండియా విజయాల వెనుక పర్ఫెక్షన్.. చిన్న విషయం కోసం కూడా వందల టేక్స్!
‘రామాయణ’ సినిమాలో జటాయువు పాత్రకు అనుపమ్ ఖేర్ వాయిస్ అందించారు. రావణుడితో పోరులో ఓడిపోయే సమయంలో జటాయువు చెప్పే ‘హే రామ్’ అనే రెండు పదాల కోసం ఆయన ఏకంగా 200 సార్లు రికార్డింగ్ చేశారట. ఆ సన్నివేశంలో భావోద్వేగాలు పండించేందుకు ఇంత కష్టపడ్డారు. ‘ఆర్ఆర్ఆర్’లో నాటు నాటు పాట సింక్రనైజేషన్ తరహాలోనే చిన్న విషయాల్లోనూ పర్ఫెక్షన్ పాన్ ఇండియా సినిమాల విజయానికి కీలకమని ఈ ఉదంతం చెబుతోంది.
By: Priya Chowdhary Nuthalapti | 16 Nov 2026 1:23 PM ISTఒక సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం.. సాధించడం అంత సులభమైన విషయం కాదు. ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే మంచి కథ, భారీ బడ్జెట్, స్టార్ హీరోలు ఉంటే సరిపోదు. ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్షన్ ఉండాలి. తెరపై ప్రేక్షకులకు కనిపించే కొన్ని నిమిషాల సన్నివేశాల వెనుక కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు రామాయణ సినిమా గురించి బయటకు వచ్చిన ఒక ఆసక్తికరమైన విషయం ఇదే విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది.
రామాయణ సినిమాలో జటాయువు.. అనుపమ్ ఖేర్ తన గొంతును అందించారు. ఈ సినిమాలో సీతను రావణుడు అపహరించే సమయంలో జటాయువు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ చివరకు రావణుడి చేతిలో ఓడిపోయి ప్రాణాలు వదిలే సమయంలో హే రామ్ అనే మాట చెబుతాడు. ఈ రెండు పదాలను చెప్పడానికి అనుపమ్ ఖేర్ ఏకంగా 200 సార్లు ప్రయత్నించారట. ఆ సన్నివేశంలో సరైన ఎమోషన్స్ పండాలని.. ఆయన మళ్లీ మళ్లీ రికార్డింగ్ చేశారని వెల్లడించారు.
రెండు పదాల కోసం ఒక నటుడు ఇన్ని ప్రయత్నాలు చేయడం చూస్తే సినిమా విషయంలో ఎంత పర్ఫెక్షన్ కోరుకుంటున్నారో అర్థమవుతుంది. ప్రేక్షకులకు ఆ రెండు పదాలు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ ఆ సీన్ క్లాసిక్ గా నిలవాలి అంటే.. ఎంత కష్టపడాలో ఈ విషయం చెబుతోంది.
గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా ఇలాంటి కష్టమే కనిపించింది. నాటు నాటు పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ఒకేలా, ఒకే సమయంలో పడేలా చేయడానికి రాజమౌళి ఎన్నోసార్లు రిహార్సల్స్ చేయించారు. ఇద్దరి స్టెప్పుల్లో చిన్న తేడా కూడా కనిపించకుండా.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెరపై మనకు అద్భుతంగా కనిపించిన ఆ సింక్రనైజేషన్ వెనుక ఎంత కష్టం ఉందో ఆ సినిమా టీం చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రామాయణ సినిమా విషయంలో కూడా ఇదే పర్ఫెక్షన్ కనిపిస్తోంది. ఒక చిన్న డైలాగ్ కోసం 200 టేక్స్ తీసుకోవడం సాధారణ విషయం కాదు. ఇలాంటి ప్రయత్నాలే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.
నిజానికి పాన్ ఇండియా హిట్ అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. భారీ బడ్జెట్ పెట్టడం, స్టార్ హీరోలను తీసుకోవడం మాత్రమే సరిపోదు. నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లు ప్రతి సన్నివేశం కోసం ఎంతో శ్రమించాలి. ప్రేక్షకులు గమనించని చిన్న చిన్న విషయాల్లో కూడా పర్ఫెక్షన్ చూపించాలి. అప్పుడే ఒక సినిమా భాషల హద్దులు దాటి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంది. ఆర్ఆర్ఆర్ నుంచి రామాయణ వరకు ఇదే విషయం మరోసారి రుజువు అయింది.
