Begin typing your search above and press return to search.

అనుమాన పక్షి ట్రైలర్: క్రేజీగా పక్షీస్ గోల..

ట్రైలర్ కట్ అంతా హీరో తన ఫాలోవర్స్ ను పక్షీస్ అని పిలుస్తూ ఒక వ్లాగ్ రికార్డ్ చేస్తున్నట్లుగా చాలా ఫన్నీగా డిజైన్ చేశారు.

By:  M Prashanth   |   21 Sept 2026 12:39 PM IST
అనుమాన పక్షి ట్రైలర్: క్రేజీగా పక్షీస్ గోల..
X

డిజే టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ విమల్ కృష్ణ నుంచి వస్తున్న సరికొత్త ప్రాజెక్ట్ అనుమాన పక్షి. ఆయన ఆలోచనలు ఎంత క్రేజీగా ఉంటాయో ఈ టైటిల్ వింటేనే ఇట్టే అర్థమైపోతుంది. రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. విమల్ కృష్ణ మార్క్ కామెడీ టైమింగ్ తో యూత్ ను టార్గెట్ చేస్తూ పక్కా ప్లాన్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది.

ట్రైలర్ కట్ అంతా హీరో తన ఫాలోవర్స్ ను పక్షీస్ అని పిలుస్తూ ఒక వ్లాగ్ రికార్డ్ చేస్తున్నట్లుగా చాలా ఫన్నీగా డిజైన్ చేశారు. హాయ్ పక్షీస్ మీ పక్షి ఇప్పుడు ఒక పెద్ద ప్యాథటిక్ సిట్యువేషన్ లో ఉన్నాడు అంటూ రాగ్ మయూర్ మొదలుపెట్టిన డైలాగ్ తోనే అసలు డ్రామా స్టార్ట్ అవుతుంది. కంటెంట్ మీద కంటే ఈ ప్రమోషనల్ స్టైల్ మీదే దర్శకుడు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది.

ముందుగా చెప్పిన పద్దెనిమిదో తేదీన సినిమా రిలీజ్ కాకపోవడం, కొత్త డేట్ ఎప్పుడో చెప్పకపోవడంతో చుట్టూ ఉన్నవాళ్లు హీరోని ఆటపట్టించే సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. కొత్త రిలీజ్ డేట్ చెప్పకపోతే కోసేసుకుంటా అని ఒకరు కామెంట్ చేస్తారు. ఇంకోసారి పాజ్ ఇస్తే చంపేస్తాను అని పోలీస్ హీరోను బెదిరించడం ట్రైలర్ లో మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఇలాంటి సిల్లీ పాయింట్స్ తోనే ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు.

తన పక్షీస్ కోసం ఇవాళ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నానని హీరో చెప్పేలోపే ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ కి బాధ్యులు ఎవరో చెబుతాను అనే టైంకి, అసలు రీజన్ తెలిస్తే మనల్ని ట్రోల్ చేస్తారు రా చెప్పకు అంటూ ఫ్రెండ్స్ అడ్డుకునే సీన్ సినిమా స్టోరీ మీద కాస్త క్యూరియాసిటీ పెంచుతోంది. ఒకవైపు టెన్షన్ ఇంకోవైపు కాన్ఫిడెన్స్ ఉన్నాయని, ప్లీజ్ నా కోసం ప్రే చేయండి అంటూ హీరో పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి.

చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక, మేఘ చిలక తదితరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రిన్స్ సిసిల్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. యూత్ కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్ తో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాకు డీసెంట్ బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మేకింగ్ వాల్యూస్ కూడా ఈ తరహా కామెడీ సినిమాలకు తగ్గట్టుగానే డీసెంట్ గా అనిపిస్తున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ లో కూడా ఆ కలర్ఫుల్ వైబ్ కనిపిస్తోంది.

అయితే ఇలాంటి క్రేజీ వ్లాగ్ స్టైల్ నరేషన్ యూత్ కు బాగానే కనెక్ట్ అయినా, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతవరకు రీచ్ అవుతుందనేది చూడాలి. కేవలం ఈ ప్రమోషనల్ కట్ మీదే కాకుండా అసలు కథలో కూడా సరైన దమ్ము ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం సాధ్యమవుతుంది. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ అనుమాన పక్షి ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో చూడాలి.