Begin typing your search above and press return to search.

చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసిన నటుడు!

హృతిక్ రోషన్ ‘కోయి మిల్ గయా’లో బిట్టు సర్దార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుజ్ పండిత్ శర్మ వివాహం చేసుకున్నారు. చిరకాల ప్రేయసి డాక్టర్ ప్రభజ్యోత్ చావ్లాతో హిందూ, సిక్కు సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుజ్ ప్రస్తుతం ‘కామన్ ఆద్మీ’ ప్రాజెక్టులో నటుడిగా, రచయితగా పనిచేస్తున్నారు.

By:  Srikanth Kontham   |   24 Nov 2026 9:48 AM IST
చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసిన  నటుడు!
X

చిన్ననాటి సినిమాల్లో పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలా 2003లో రిలీజ్ అయిన‌ సూపర్ హిట్ చిత్రం `కోయి మిల్ గయా`లో బిట్టు సర్దార్ పాత్రతో మెప్పించిన నటుడు అనుజ్ పండిత్ శర్మ ఓ ఇంటి వారయ్యారు. చిరకాల ప్రేయసి డాక్టర్ ప్రభజ్యోత్ చావ్లాను అనుజ్ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు.. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో

వైర‌ల్ అవుతున్నాయి.

హిందూ.. సిక్కు సంప్రదాయాల ప్ర‌కారం వివాహం జ‌రిగింది. అగ్నిసాక్షిగా సప్తపది తొక్కడంతో పాటు.. గురుద్వారాలో పెళ్లి పత్రాలపై సంతకాలు చేసే సంప్రదాయాన్ని కూడా పూర్తి చేశారు. ఈ వేడుకలో అనుజ్ ఆఫ్-వైట్ ఎంబ్రాయిడరీ షేర్వాణీలో ఆకట్టుకోగా.. ప్రభజ్యోత్ సంప్రదాయ ఎరుపు రంగు లెహంగాలో మెరిశారు.ప్రభజ్యోత్ విషయానికి వస్తే ఆమె హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకురాలిగా.. ఫిట్‌నెస్ రంగంలోనూ చురుగ్గా పని చేస్తున్నారు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఇద్ద‌రు కొత్త జీవితంలోకి అడుగుపెట్టడంపై అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

రాకేశ్ రోషన్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా తెర‌కెక్కిన `కోయి మిల్ గయా`లో జాదూతో స్నేహం చేసే పిల్లల బృందంలో బిట్టుగా అనుజ్ బాగా పాపులర్ అయ్యారు. అదే ఏడాది `డర్నా మనా హై`లోనూ కనిపించిన ఆయన ఆ తర్వాత `సే సలామ్ ఇండియా`, యామీ గౌతమ్ సోదరుడిగా `టోటల్ సియాపా` వంటి చిత్రాల్లో నటించారు. సినిమాలకే పరిమితం కాకుండా బుల్లితెరపై `పర్వరిష్ సీజన్ 2`, `ఆదత్ సే మజ్బూర్` వంటి సీరియల్స్‌లోనూ అనుజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డిస్నీ హాట్‌స్టార్‌లో వచ్చిన `బామినీ అండ్ బాయ్స్` వెబ్ సిరీస్‌లోనూ కనికా కపూర్‌తో కలిసి `మేరీ హీరియ్యే`, `తేరే వాస్తే` వంటి మ్యూజిక్ వీడియోలలోనూ మెరిసారు.

ప్రస్తుతం ఖుషాల్ ఎస్. రాథోడ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌`కామన్ ఆద్మీ` ప్రాజెక్ట్‌తో అనుజ్ బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన నటించడంతో పాటు రచయితగానూ పని చేస్తున్నారు. రితుపర్ణ సేన్‌గుప్తా, సోనాలి కులకర్ణి, బ్రిజేంద్ర కాలా, అల్కా అమీన్ వంటి సీనియర్లు నటిస్తున్న చిత్రంపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి.