Begin typing your search above and press return to search.

'ఫంకీ' టీజర్.. విశ్వక్ మాస్ లో అనుదీప్ కితకితలు

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఇప్పుడు ఫంకీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే

By:  M Prashanth   |   10 Oct 2025 5:32 PM IST
ఫంకీ టీజర్.. విశ్వక్ మాస్ లో అనుదీప్ కితకితలు
X

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఇప్పుడు ఫంకీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. జాతిరత్నాలు, ప్రిన్స్ వంటి సినిమాల‌ను తెర‌కెక్కించిన కేవీ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కోలీవుడ్ బ్యూటీ కాయ‌దు లోహ‌ర్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంట‌ర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. కామెడీ ఎంటర్టైనింగ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన అనుదీప్ డైరెక్షన్‌ లో విశ్వక్ సేన్.. సినిమా చేస్తుండడంతో ఆడియన్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు.

తాజాగా మేకర్స్ ఫంకీ టీజర్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట వినలేదు రా మను అంటూ ఫన్నీ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత విశ్వక్ ఎంట్రీ ఇచ్చారు. తాను చదువుకున్న స్కూల్ లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కనిపించారు.

"నేను ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూల్లో చదువుకోవడం.. స్కూల్ లో చదువుకున్నాకే నాకు చదువుపై విరక్తి పుట్టింది.. అందుకే సినిమాల్లోకి వెళ్లా" అని చెబుతారు. ఆ తర్వాత పంచ్ డైలాగ్స్ తో అదరగొడతారు. నేనెక్కడినే లేకుంటే లేనట్లే.. వన్స్ వస్తే ఇక్కడే ఉంటా.. మా బావకు సినిమాలో బావ క్యారెక్టర్ ఇస్తా అనే డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి.

కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌ గా రాబోతున్న ఫంకీ.. సినీ ఇండస్ట్రీపై సెటైరిక‌ల్‌గా తెర‌కెక్కుతున్నట్లు టీజర్ ద్వారా క్లారిటీ వచ్చింది. అనుదీప్ దర్శకత్వంలో ఫన్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిపేలా టీజర్ ఎంతో హాస్యభరితంగా, ఓ విందు భోజనంలా ఉందనే చెప్పాలి. సినిమాలో విశ్వక్ సేన్ చాలా కొత్తగా.. డైరెక్టర్ రోల్ లో కనిపించనున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

హీరోయిన్ కాయదు లోహర్‌ తన అందంతో కట్టిపడేశారు. టీజర్ లో భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనదైన నేపథ్య సంగీతంతో ప్రతి షాట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. దర్శకుడు అనుదీప్ మార్క్ టీజర్ లో అడుగడుగునా కనిపించింది. జాతిరత్నాలుకు మించి నవ్వులను పంచనున్నారని టీజర్ ద్వారా తెలుస్తోంది.

నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాను ఆకర్షణీయంగా ప్రజెంట్ చేస్తుందని హామీ ఇస్తుంది. సురేష్ సారంగం కెమెరా పనితనం టీజర్ ను మరింత అందంగా మలిచింది. కథకు తగ్గట్టు ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపిస్తూ, విజువల్ గా అద్భుతంగా ఉంది. నిర్మాతలుగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఫంకీ టీజర్ ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునే ఎంటర్టైనర్ గా మూవీగా ఉంటుందని హామీ ఇస్తుంది.