అనుదీప్.. ఆ హీరో మీద ఇంకా హోప్స్ ఉన్నాయా?
టాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనుదీప్.. ఆ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది జాతిరత్నాలు మూవీ అని చెప్పాలి.
By: M Prashanth | 9 March 2026 11:08 AM ISTటాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనుదీప్.. ఆ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది జాతిరత్నాలు మూవీ అని చెప్పాలి. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ మిస్డ్ కాల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన అనుదీప్, ప్రముఖ స్క్రీన్ రైటర్స్ వద్ద సీన్స్ రాసే ఛాన్స్ అందుకున్నారు. ఆ తర్వాత 2013లో విడుదలైన ఉయ్యాల జంపాలా సినిమా ద్వారా విరించి వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు.
అక్కడికి కొన్నేళ్లకు పిట్టగోడ సినిమా ద్వారా దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. 2021లో దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్టైనర్ జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్నోసెంట్ కామెడీతో అందరినీ ఆకట్టుకుని.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో అనుదీప్ అప్ కమింగ్ మూవీస్ ఎలా ఉంటాయో చూడాలని అంతా తహతహలాడారు.
అయితే జాతిరత్నాలు తర్వాత ప్రిన్స్ మూవీతో కోలీవుడ్ లోకి అనుదీప్ అరంగేట్రం చేయగా.. ఆ సినిమా అనుకున్న రేంజ్ లో రిజల్ట్ అందుకోలేకపోయింది. కానీ అప్పుడప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ అలరించారు. రీసెంట్ గా ఫంకీ మూవీని తెరకెక్కించగా.. మరో జాతిరత్నాలు అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సినిమా కంప్లీట్ గా నిరాశపరిచింది. అనుదీప్ ఖాతాలో భారీ డిజాస్టర్ పడింది.
దీంతో అనుదీప్ నెక్స్ట్ ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఆ విషయంపై అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి.. ఫంకీ రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో అనుదీప్ తన అప్ కమింగ్ మూవీలపై రెస్పాండ్ అవుతూ.. వెంకటేష్ కోసం తాను ఒక ప్రత్యేకమైన కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే అప్పటికే ఆయన వెంకీకి ఒక కథ వినిపించారని టాక్ వచ్చింది.
అనుదీప్ నెరేషన్ కు వెంకటేష్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని, కానీ స్క్రిప్ట్ లో మరిన్ని మెరుగులు దిద్దాలని సూచించారని వార్తలు వచ్చాయి. ఫైనల్ వెర్షన్ సిద్ధమయ్యాక మరోసారి నేరేషన్ ఇవ్వాలని చెప్పినట్టు గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఫంకీ రిజల్ట్ తర్వాత అనుదీప్ తో మూవీకి వెంకటేష్ ఏమంటారో.. గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో అన్నది డౌటేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఎందుకంటే ఏ డైరెక్టర్ అయినా హిట్ కొడితే.. నెక్స్ట్ మూవీకి ఈజీగా ఛాన్స్ వస్తుంది. కానీ ఫ్లాప్ పడితే అంత ఈజీగా తర్వాత మూవీ సెట్స్ పైకి వెళ్లదు. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్ల విషయంలో అదే జరిగింది. దీంతో అనుదీప్ తన తర్వాత చిత్రం ఎవరితో చేయనున్నారనేది ఇంకా క్లారిటీ రాలేదు. వెంకటేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే తెలుస్తున్నా.. ఆయన ఓకే చెప్తారో లేదో ఎవరూ గెస్ చేయలేదు. అందుకే అనుదీప్ నెక్స్ట్ ఏంటన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
