పెళ్లిపై అనుదీప్ కామెంట్.. ఏం క్లారిటీ గురూ
ఫిబ్రవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు అనుదీప్, విశ్వక్ సేన్, కయాదు లోహర్.
By: Madhu Reddy | 27 Jan 2026 1:07 PM ISTనవీన్ పోలిశెట్టి లీడ్ రోల్ పోషిస్తూ.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమవుతూ వచ్చిన చిత్రం 'జాతిరత్నాలు'. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనుదీప్. మొదటి సినిమాతోనే దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును దక్కించుకున్నారు. దర్శకుడుగానే కాకుండా అప్పుడప్పుడు పలు చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇస్తున్న ఈయన తాజాగా విశ్వక్ సేన్ తో కలిసి ఫంకీ సినిమా చేస్తున్నారు. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు అనుదీప్, విశ్వక్ సేన్, కయాదు లోహర్.
ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్నో విషయాలను పంచుకున్న అనుదీప్.. తన పెళ్లిపై కూడా కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ప్రస్తావన రాగా అనుదీప్ మాట్లాడుతూ.." నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. అయితే ఈ విషయం నేను ఆ అమ్మాయికి చెప్పలేదు. నాది వన్ సైడ్ లవ్. ప్రస్తుతం ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి.. ఎక్కడో ఉంటోంది. అలా స్కూల్లో ప్రేమించిన అమ్మాయికే నా మొదటి ప్రేమను చెప్పలేదు. కాబట్టి ఇక ప్రేమపై పెద్దగా ఆసక్తి ఏర్పడలేదు. అందుకే కాలేజీలో కూడా నేను ఎవరిని ఇష్టపడలేదు. ప్రస్తుతం ప్రేమ , పెళ్లి మీద పెద్దగా ఆసక్తి లేదు. ఇక పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అంతకంటే లేదు" అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇది విన్న అభిమానులు ఏం క్లారిటీ గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇది విన్న మరి కొంతమంది అభిమానులు అనుదీప్ నిజంగానే పెళ్లి చేసుకోడా? అసలు ఈ పెళ్లి విషయంలో అంత క్లారిటీగా ఉన్నాడా? అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది కామెడీ విషయాన్ని కూడా సీరియస్ ఫేస్ పెట్టి చెప్పే అనుదీప్ నిజంగానే ఈ విషయాన్ని సీరియస్గా చెప్పాడా? లేక జోక్ చేశాడా ?అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో అనుదీప్ గురించి హీరోయిన్ కయాదులోహర్ చేసిన కామెంట్లు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో భాగంగా.. ఈ సినిమాలో విశ్వక్ , కయాదు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. అయితే ఈ సీన్లు చెయ్యను అని కయాదు మొండికేసింది అంటూ అనుదీప్ సరదాగా చెప్పగా.. అయితే అనుదీప్ మాటలను విశ్వక్ హిందీలోకి అనువదించి చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోయిన కయాదు రొమాంటిక్ సీన్లు చేయడంలో నాకేమీ ఇబ్బంది లేదు. కానీ అనుదీప్ వాటిని చేయడానికి తడబడ్డాడు.
ఆ సీన్లు తీసేటప్పుడు పదే పదే కట్ చెప్పేవాడు. ఆర్టిస్టుల కంటే దర్శకుడికే అవి చేయడానికి ఇబ్బంది కలిగింది అంటూ ఆమె కామెంట్లు చేసింది.. మొత్తానికైతే హీరోయిన్ ధైర్యంగా ఇలాంటి ఇంటిమేట్ సీన్లు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు డైరెక్టర్ అనుదీప్ వెనుకడుగు వేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం పెళ్లి చేసుకోనని చెప్పిన అనుదీప్ భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి.
