Begin typing your search above and press return to search.

ప్రిన్స్ నేర్పిన పాఠం అదే!

ప్రిన్స్ మూవీ ఆశించిన స్థాయిలో అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింద‌ని ఒప్పుకున్న అనుదీప్, దానికి ప్ర‌ధాన కార‌ణం స్క్రిప్ట్ కు స‌రైన టైమ్ కేటాయించ‌లేక‌పోవ‌డ‌మేన‌ని వెల్ల‌డించారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   11 Feb 2026 4:00 PM IST
ప్రిన్స్ నేర్పిన పాఠం అదే!
X

జాతిర‌త్నాలు మూవీతో తెలుగు ఆడియ‌న్స్ ను క‌డుపుబ్బా న‌వ్వించిన డైరెక్ట‌ర్ అనుదీప్ కెవి ఇప్పుడు త‌న కొత్త సినిమా ఫంకీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. విశ్వ‌క్ సేన్ హీరోగా, క‌యాదు లోహ‌ర్ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ జాతిరత్నాలు లాగానే బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేసి, అనుదీప్, విశ్వ‌క్ కెరీర్లో మ‌రో కీల‌క మ‌లుపుగా మార‌నుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

ప్రిన్స్ నుంచి ఫాఠం నేర్చుకున్నా!

అత‌ని గ‌త చిత్రం ప్రిన్స్ అనుకున్న అంచ‌నాల‌ను అందుకోక‌పోవ‌డంతో ఆ అనుభవాన్ని ఓ పాఠంగా తీసుకున్న అనుదీప్ ఈసారి ఫంకీ సినిమాను మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని చేసిన‌ట్టు తెలుస్తోంది. ఫంకీ మూవీ ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న అనుదీప్ త‌న గ‌త అనుభ‌వాలు, భ‌విష్య‌త్ ల‌క్ష్యాలు, త‌న సినిమాల శైలి గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య‌లు చేశారు.

అందుకే ప్రిన్స్ అనుకున్న ఫ‌లితాన్ని అందుకోలేదు

ప్రిన్స్ మూవీ ఆశించిన స్థాయిలో అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింద‌ని ఒప్పుకున్న అనుదీప్, దానికి ప్ర‌ధాన కార‌ణం స్క్రిప్ట్ కు స‌రైన టైమ్ కేటాయించ‌లేక‌పోవ‌డ‌మేన‌ని వెల్ల‌డించారు. ఒక క‌థ‌కు కావాల్సిన టైమ్ ఇవ్వ‌క‌పోతే ఆ లోటు స్క్రీన్ పై క‌నిపిస్తుంద‌ని, ఆ ఎక్స్‌పీరియెన్స్ తోనే ఫంకీ కోసం స్పెష‌ల్ గా టైమ్ తీసుకుని, ఈసారి క‌థ‌, స్క్రీన్ ప్లే, క్యారెక్ట‌ర్ డిజైన్ తో పాటూ మిగిలిన అన్ని ఎలిమెంట్స్ పైన కూడా పూర్తి దృష్టి పెట్టిన‌ట్టు అనుదీప్ చెప్పారు.

లాజిక్ తోనే సినిమాలు చేస్తా!

అనుదీప్ అన‌గానే అంద‌రికీ జాతిర‌త్నాలు మూవీ గుర్తు రావ‌డంతో పాటూ, అత‌ని సినిమాల్లో లాజిక్ ఉండ‌ద‌నే మాట ఎక్కువ‌గా వినిపిస్తుంద‌ని, కానీ త‌న సినిమాల్లో కామెడీ ఉన్న‌ప్ప‌టికీ లాజిక్ కూడా ఉంటుంద‌ని, కామెడీని కూడా క‌థ‌లోనే మేళ‌విస్తాన‌ని, ఫంకీ మూవీ జాతిర‌త్నాలు సినిమాకు భిన్నంగా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ జెన‌రేష‌న్ అభిరుచికి త‌గ్గ‌ట్టుగా ఉండ‌టానికే ఆ టైటిల్‌ను పెట్టామ‌ని చెప్పిన అనుదీప్, ఈ క‌థ రాసుకున్న‌ప్పుడే విశ్వ‌క్ సేన్ ను హీరోగా అనుకున్న‌ట్టు చెప్పారు.

కార‌వాన్ లో కూర్చోవ‌డం ఇబ్బందే

అయితే అనుదీప్ ఓ వైపు డైరెక్ట‌ర్ గా ఉంటూనే, మ‌రోవైపు ప‌లు సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. యాక్టింగ్, డైరెక్ష‌న్ లో త‌న‌కు డైరెక్ష‌న్ అంటేనే ఇష్ట‌మ‌ని, ఆడియ‌న్స్ కు క‌థ‌లు చెప్పి వారిని అల‌రించ‌డ‌మే న‌చ్చుతుందని, యాక్టింగ్ చేస్తూ కార‌వాన్ లో కూర్చున్న‌ప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని, అస‌లు ఇదెందుకు చేస్తున్నానా అనిపిస్తుంద‌ని చెప్పారు అనుదీప్. ఫ్యూచ‌ర్ లో డైరెక్ష‌న్ కే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాన‌ని చెప్పిన అనుదీప్, త‌న నుంచి ఇక‌పై రాబోయే సినిమాల్లో కొత్త‌ద‌నం చూస్తార‌ని చెప్పారు. త‌న నెక్ట్స్ మూవీ కోసం ఓ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్న అనుదీప్, వెంక‌టేష్ కూడా ఓ స్టోరీని సిద్ధం చేస్తున్న‌ట్టు తెలిపారు. అనుదీప్ మాట‌ల్ని బ‌ట్టి చూస్తుంటే ఫంకీ స‌క్సెస్ పై అత‌నికి చాలా కాన్ఫిడెన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఫంకీ ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.