హిట్ తో సెకెండ్ ఇన్నింగ్స్ సాధ్యమేనా?
ఏ పరిశ్రమలోనూ హీరోయిన్ అవకాశాలు కష్టం. ఈ నేపథ్యంలో సొగసరి సెకెండ్ ఇన్నింగ్స్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడమే ముఖ్యం.
By: Srikanth Kontham | 9 Nov 2025 5:00 PM ISTస్టార్ హీరోలతో ఛాన్సులందుకుని మరీ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయిన మరో నటి అను ఇమ్మాన్యుయేల్. దేశాలు దాటి అమ్మడు స్టార్ హీరోయిన్ అవ్వాలని టాలీవుడ్ కి వచ్చింది. అమ్మడు అందం, అభినయంతో మంచి అవకాశాలే అందుకుంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా మూడు భాషల్ని టచ్ చేసింది. కానీ ఎక్కడా నిలదొ క్కుకోలేదు. అప్పటి కప్పుడు అవకాశం వచ్చిందా? నటించానా? లేదా? అన్నట్లే కెరీర్ సాగించింది. ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. అమ్మడు హీరోయిన్ గా సినిమా చేసి మూడేళ్లు అవుతుంది.
విజయంతో ప్రత్యేకమైన గుర్తింపు:
చివరిగా తమళ్ లో`జపాన్` లో నటించిగా, తెలుగులో `ఊర్వశివో రాక్షసివో`లో నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయలేదు. ఆమె స్థానాన్ని కొత్త నటీమణులు ఆక్రమించడంతో? అవకాశాలకు పూర్తిగా దూరమైంది. ఇటీవలే రిలీజ్ అయిన `దిగర్ల్ ప్రెండ్` లో మాత్రం `దుర్గ` అనే పాత్రలో నటించింది. సినిమాలో పోషించింది చిన్న పాత్రే అయినా? సినిమా విజయం సాధించడంతో సక్సెస్ లో భాగంగా మారింది. అమ్మడికిది సెకెండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఒకసారి గెస్ట్ రోల్స్, కామియో పాత్రలు మొదలు పెట్టిన తర్వాత తిరిగి హీరోయిన్ అవకాశాలు అందుకోవడం అన్నది దాదాపు అసాధ్యం.
సక్సెస్ ఇచ్చిన కిక్ లో:
ఏ పరిశ్రమలోనూ హీరోయిన్ అవకాశాలు కష్టం. ఈ నేపథ్యంలో సొగసరి సెకెండ్ ఇన్నింగ్స్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడమే ముఖ్యం. గర్ల్ ప్రెండ్ లో పోషించిన పాత్ర పెద్ద విజయం సాధించడంతో అమ్మడు ఎంతో షంతోషంగా ఉంది. తన మాటల్లోనే సక్సెస్ ఇచ్చిన కిక్ ఎలా ఉంటుంది? అన్నది అర్దమైంది. `ది గర్ల్‌ఫ్రెండ్ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. దుర్గ పాత్ర నిడివి తక్కువే అయినా? అది నాకు అరుదుగా లభించే పరిపూర్ణమైన సంతృప్తిని ఇచ్చింది. ఆ పాత్రలో నిశ్శబ్దమైన బలం ఉంది. మాటల కన్నా మౌనంతోనే ఎక్కువగా మాట్లాడే తత్వం అది.
ఆ పాత్రతో ప్రత్యేకమైన గుర్తింపు:
ఆ పాత్రకు జీవం పోసే క్రమంలో, నాలో నేను కూడా ఒక కొత్త కోణాన్ని కనుగొన్నాను` అంటూ ఇన్ స్టాలో రాసు కొచ్చింది. అలాగే చిన్నపాటి సెటైర్ కూడా అందులోనే విసిరింది. మహిళల పాత్రలను నిజాయతీగా, లోతుగా రాసి నందుకు టీమ్ కు ధన్యవాదాలు తెలిపింది. పాత్రలో నటించేటప్పుడు అక్షరాలా తన చేయి పట్టుకుని నడి పించారంది. ప్రతి సంభాషణా ఎంతో అద్భుతంగా అనిపించిందంది. గతంలో తాను పోషించిన హీరోయిన్ల పాత్రల కంటే చిన్న పాత్ర అయినా ఈ సినిమా ద్వారా వచ్చిన గుర్తింపును చెప్పకనే చెప్పింది. మరి అమ్మడి సెకెండ్ ఇన్నింగ్స్ ఈ పాత్ర ఎంత వరకూ సహకరిస్తుందో చూడాలి.
