252 కోట్ల డ్రగ్స్ కేసు.. ఒర్రీ చుట్టూ నార్కో ఉచ్చు?
ఓర్రీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పార్టీలలో గాళ్స్ తో విందు వినోదంలో తలమునకలుగా ఉండే ఈ యంగ్ బోయ్ ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు.
By: Sivaji Kontham | 21 Nov 2025 12:46 PM ISTగ్లామర్ ప్రపంచంతో మాదక ద్రవ్యాల అనుబంధం విడదీయలేనిదిగా కనిపిస్తోంది. నైట్ క్లబ్ లు, పబ్బులు, పార్టీ హౌస్ లు, సిటీ ఔటర్ లో రేవ్ పార్టీలలో లేదా దుబాయ్ లాంటి చోట్ల పార్టీలలో సెలబ్రిటీలు స్వేచ్ఛగా డ్రగ్స్ ని వినియోగిస్తున్నారని పోలీసులు తమ కథనాలలో పేర్కొనడం ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇప్పుడు 252 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాల స్వాధీనం కేసుతో సంబంధం ఉన్న దుబాయ్ షేక్ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ఒర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి పేరును బయటపెట్టడం పెద్ద షాకింగ్ గా మారింది.
ఓర్రీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పార్టీలలో గాళ్స్ తో విందు వినోదంలో తలమునకలుగా ఉండే ఈ యంగ్ బోయ్ ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు. జాతీయ మీడియా కథనం ప్రకారం.. రూ. 252 కోట్ల మెఫెడ్రోన్ స్వాధీనం కేసులో కీలక నిందితుడైన మహ్మద్ సలీం మొహమ్మద్ సుహైల్ షేక్ విచారణ సందర్భంగా ఓర్హాన్ అవ్రతమణి పేరు తెరపైకి రావడం షాకిచ్చింది. ఓర్రీకి ఇప్పటికే యాంటీ నార్కోటిక్స్ సెల్ (ANC) సమన్లు జారీ చేసింది.
కానీ ఒర్రీ 25 నవంబర్ వరకూ తనకు సమయం కావాల్సిందిగా విచారణకు స్కిప్ కొట్టడం హాట్ టాపిగ్గా మారింది. సినీరాజకీయ రంగాలు, ఫ్యాషన్ ప్రపంచంలోని బిగ్ షాట్స్ తో ఇంతకుముందు దుబాయ్ లో నిర్వహించిన రేవ్ పార్టీలో సెలబ్రిటీల డ్రగ్స్ వినియోగంతో పాటు, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం బంధువు లింకులు బయటపడటం కూడా షాకిచ్చింది. షేక్ నిర్వహించిన రేవ్ పార్టీలలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు. షేక్ బాలీవుడ్ కి చెందిన ఇద్దరు అందాల కథానాయికల పేర్లను బయటకు చెప్పాడని ఇటీవల కథనాలొచ్చాయి.
షేక్ తన విచారణలో పలువురు హీరోయిన్ ల పేర్లతో పాటు, ప్లేబోయ్ ఓర్రీ పేరు కూడా చెప్పాడు. ఈ పేరు బయటకు రాగానే విచారణ కోసం నార్కోటిక్స్ అధికారులు అతడికి ఆలస్యం చేయకుండా సమన్లు పంపారు. కానీ అతడు సమయం కోరుతూ విచారణకు స్కిప్ కొట్టాడు.
`లావిష్` అని ముద్దుగా పిలుచుకునే మిస్టర్ దుబాయ్ షేక్ భారతదేశంలో అత్యంత ప్రమాదకర మాదకద్రవ్యంగా పేర్కొనే మెఫెడ్రోన్ తయారీ, పంపిణీలో కీలక వ్యక్తి. అతడు గ్యాంగ్‌స్టర్ సలీం డోలాకు అత్యంత సన్నిహితుడు అని కూడా తెలుస్తోంది. గత సంవత్సరం మహారాష్ట్రలోని సాంగ్లీలోని ఒక డ్రగ్ ఫ్యాక్టరీ నుండి రూ.252 కోట్ల మెఫెడ్రోన్ స్వాధీనం కేసులో షేక్‌ను మొదట అరెస్టు చేశారు. ఆ తర్వాత యాంటి నార్కోటిక్స్ - ఘట్కోపర్ యూనిట్ మోస్ట్ వాంటెడ్ షేక్ ను అరెస్టు చేసింది.
ఓర్రీ గురించి చెప్పాల్సి వస్తే, అతడు ఇటీవల నటనలోకి కూడా రంగ ప్రవేశం చేసాడని కథనాలొచ్చాయి. అతడికి సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. అలాగే జీవించడం కోసం రిలయన్స్ కంపెనీలో ఒక ఉద్యోగం కూడా చేస్తున్నానని గతంలో చెప్పాడు. ఒర్రీ ఇటీవల గురిందర్ చద్దా చిత్రం `క్రిస్మస్ కర్మ`తో హాలీవుడ్‌లో ఆరంగేట్రం చేశానని పేర్కొన్నాడు.
