Begin typing your search above and press return to search.

పంజాబీ యువ‌కుడితో అన్షులా పెళ్లి.. క‌పూర్ త్రీరోజెస్ సంద‌డే సంద‌డి

అయితే కెరీర్ ప‌రంగా ఎప్పుడూ బిజీగా ఉండే ఈ క‌పూర్ త్రీరోజెస్ ఇప్పుడు ఒక ప్ర‌త్యేక వేడుక సంద‌ర్భంగా ఓ చోటికి చేరారు. ఆ వేడుక ఏమిటి? అంటే.. త‌మ సోద‌రి అన్షులా క‌పూర్ పెళ్లి వేడుక‌.

By:  Sivaji Kontham   |   24 Jun 2026 7:21 PM IST
పంజాబీ యువ‌కుడితో అన్షులా పెళ్లి.. క‌పూర్ త్రీరోజెస్ సంద‌డే సంద‌డి
X

అందంలో ఫ్యాష‌న్ సెన్స్ లో ప్ర‌తిభ‌లో క‌పూర్ సిస్ట‌ర్స్ ఎప్పుడూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. అయితే క‌పూర్ సిస్ట‌ర్స్ లో సోన‌మ్ క‌పూర్ పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో లండ‌న్ లోనే ఎక్కువ‌గా గ‌డుపుతున్నారు. అప్పుడ‌ప్పుడు సినిమాల్లో న‌టిస్తూ త‌మ కుటుంబ వ్యాపారాల్లో త‌ల‌మున‌క‌లుగా ఉన్నారు.

మ‌రోవైపు సోన‌మ్ క‌పూర్ త‌ర్వాత సినీగ్లామ‌ర్ జ‌గ‌త్తులో మెరిసిన మ‌రో గొప్ప ఫ్యాష‌నిస్టా కం న‌టి జాన్వీ క‌పూర్ ఇటీవ‌ల టాలీవుడ్‌లో బిగ్ డ్రీమ్స్ ని నిజం చేసుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న సంగ‌తి తెలిసిందే. హిందీ సినిమాల్లో నటిస్తూనే, సౌత్ లో త‌న త‌ల్లి శ్రీ‌దేవి బాట‌లోనే రాణించాల‌నే ప్ర‌ణాళిక జాన్వీకి ఉంది. ఇక అక్క జాన్వీక‌పూర్ బాట‌లోనే ఖుషీ క‌పూర్ కూడా వెళ్లాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంది. ఖుషీ డెబ్యూ సినిమాలు ఆశించిన విజ‌యాల్ని అందించ‌క‌పోయినా కానీ, త‌న ప్ర‌య‌త్నాల‌కు డోఖా ఏం లేదు. ఈ ముగ్గురు సిస్ట‌ర్స్ రెగ్యుల‌ర్ ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ లో హ‌ల్చ‌ల్ చేస్తుంటే యూత్ ఎంత క్రేజీ గా ఫీల‌వుతారో చూస్తున్న‌ద‌.

అయితే కెరీర్ ప‌రంగా ఎప్పుడూ బిజీగా ఉండే ఈ క‌పూర్ త్రీరోజెస్ ఇప్పుడు ఒక ప్ర‌త్యేక వేడుక సంద‌ర్భంగా ఓ చోటికి చేరారు. ఆ వేడుక ఏమిటి? అంటే.. త‌మ సోద‌రి అన్షులా క‌పూర్ పెళ్లి వేడుక‌. బోనీక‌పూర్ మొద‌టి భార్య కుమార్తె అన్షుల‌కు శ్రీ‌దేవి కుమార్తెలు జాన్వీక‌పూర్- ఖుషీ క‌పూర్ అత్యంత స‌న్నిహితులు. ఒకే కుటుంబంలో క‌లిసి మెలిసి పెరుగుతూ స్ఫూర్తిని నింపుతున్నారు. ఇప్పుడు త‌మ సోద‌రి అన్షుల పెళ్లి వేడుక‌లో క‌పూర్ సిస్ట‌ర్స్ సంద‌డి మామూలుగా లేదు. ఇక ఈ పెళ్లి వేడుక‌లో బోనీతో పాటు అన్షుల‌- జాన్వీల సోద‌రుడు అర్జున్ కపూర్ కూడా సంద‌డిగా క‌నిపిస్తున్నారు.

33 ఏళ్ల అన్షులా కపూర్ తన కాబోయే భర్త రోహన్ ఠక్కర్‌తో కలిసి సోమవారం జరిగిన `మాతా కీ చౌకీ` (పూజా కార్యక్రమం)కి సంబంధించిన మొదటి చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. కపూర్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఏకాంతంగా, పద్ధతిగా జరిగిన ఈ పూజా కార్యక్రమం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు కపూర్ కుటుంబ సభ్యులంతా సాంప్రదాయ దుస్తుల్లో హాజరై సందడి చేశారు. అన్షులా తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, సోదరీమణులు జާన్వీ కపూర్, ఖుషీ కపూర్ , షానాయ కపూర్‌లు ఈ పూజలో పాల్గొని సందడి చేసిన వారిలో ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని క్షణాలను షానాయా కపూర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతున్న కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లి వేడుక‌ల్లో వ‌ధూవ‌రులు అన్షులా- ట‌క్క‌ర్ ఎంతో వైబ్రేంట్ గా మెరిసిపోతున్న ఫోటోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి.

నా జీవితంలోని ఈ కొత్త అధ్యాయాన్ని (రోహన్‌తో ప్రయాణాన్ని) ప్రారంభించడానికి ఇంతకంటే సరైన మార్గం మరొకటి లేదు! అంటూ అన్షులా ఎంతో ఆనందం వ్య‌క్తం చేసారు. అన్షులా, రోహన్‌ల బంధం విషయానికి వస్తే.. వీరిద్దరూ 2022లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత మూడేళ్ల ప్రేమ ప్రయాణం అనంతరం జూలై 2025లో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. సెంట్రల్ పార్క్‌లోని క్యాజిల్ ముందు రోహన్ తనకు ప్రపోజ్ చేశాడని, సరిగ్గా తాము మొదటిసారి మాట్లాడుకున్న సమయానికే (రాత్రి 1:15 గంటలకు) ఈ ప్రపోజల్ జరగడం ఒక మ్యాజిక్‌లా అనిపించిందని అన్షులా గతంలో తెలిపారు. కాగా బోనీ కపూర్-మోనా శౌరి కపూర్‌ల కుమార్తె అయిన అన్షులా ఇటీవల ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిన రియాలిటీ షో `ది ట్రెయిటర్స్` లో కనిపించారు.