సోదరి పెళ్లిలో జాన్వీ జోరు..
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె, జాన్వీ కపూర్ సోదరి అంషులా కపూర్ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి.
By: Madhu Reddy | 7 July 2026 11:24 AM ISTబాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె, జాన్వీ కపూర్ సోదరి అంషులా కపూర్ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. తన లాంగ్ టైమ్ పార్ట్నర్, ప్రముఖ స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్‌తో అంషులా జూలై 6న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన కలర్‌ఫుల్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జాన్వీ, ఖుషీ కపూర్‌ల సందడి ఈ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పెళ్లికూతురి లుక్ అదిరింది:
ఈ పెళ్లి వేడుకలో పెళ్లికూతురు అంషులా కపూర్ లుక్ అందరినీ కట్టిపడేసింది. ఆమె ఎంతో అందమైన ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న పీచ్ అండ్ కోరల్ కలర్ లెహంగాను ధరించారు. దీనికి కాంబినేషన్‌గా మెరిసిపోయే గోల్డెన్-బీజ్ దుపట్టా, లేయర్స్ ఉన్న ట్రెడిషనల్ పోల్కీ జ్యువెలరీని మ్యాచ్ చేసి రాయల్ లుక్‌లో మెరిసిపోయారు. ఇక తన జీవితంలోని ఈ ముఖ్యమైన రోజున అంషులా ఎంతో సంతోషంగా కనిపించారు.
మెహందీ వేడుకతో సర్ప్రైజ్ చేసిన సిస్టర్స్:
అర్జున్ కపూర్, అంషులా కపూర్, వారి సిస్టర్స్ జాన్వీ, ఖుషీ కపూర్‌ల మధ్య ఉన్న బాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ పెళ్లిలో సోదరీమణులు ఇద్దరూ అన్ని తామై చూసుకున్నారు. జూలై 5న ముంబైలోని తమ ఇంట్లోనే అంషులా కోసం జాన్వీ, ఖుషీ ఒక స్పెషల్ మెహందీ వేడుకను ప్లాన్ చేశారు. అంషులాకు నచ్చిన వంటకాలతో, ఆమెకు ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చారు.
బ్రైడ్స్‌మైడ్స్‌గా జాన్వీ, ఖుషీ కపూర్ హడావిడి:
ఈ వెడ్డింగ్‌లో బ్రైడ్స్‌మైడ్స్‌గా జాన్వీ, ఖుషీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిన ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌లో వీరిద్దరూ మెరిసిపోయారు. ఇక జాన్వీ ఐవరీ కలర్ ఫ్లోరల్ లెహంగాలో మెరిసిపోగా, ఖుషీ కపూర్ పిస్తా గ్రీన్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ లెహంగా, హెవీ చోకర్‌తో మెస్మరైజ్ చేశారు. ఇక పెళ్లిలో సింధూర్ వేడుక వంటి కీలక ఆచారాలన్నింటిలోనూ ఈ ఇద్దరు సోదరీమణులు యాక్టివ్‌గా పాల్గొని సందడి చేశారు.
వైరల్ అవుతున్న వెడ్డింగ్ పిక్స్:
ఖుషీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. "వాళ్లు పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించారు" అంటూ క్యాప్షన్ పెట్టారు. కపూర్ సిస్టర్స్ చేసిన ఈ పెళ్లి సందడి ఫొటోలు ఫ్యాన్స్‌కు కనుల పండుగలా ఉన్నాయి. ఇక కొత్త దంపతులు అంషులా, రోహన్ థక్కర్ లీడ్ చేయబోయే సరికొత్త జీవితానికి నెటిజన్లు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
