చూపు తిప్పుకోనివ్వని 'మన్మథుడు' బ్యూటీ.. స్టన్నింగ్!
లేటెస్ట్ గా ఆమె షేర్ చేసుకున్న ఫొటోలు ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు చీరలో, ట్రెడిషనల్ సిల్వర్ జ్యువెలరీతో అచ్చం దేవకన్యలా మెరిసిపోతోంది.
By: M Prashanth | 17 Oct 2025 8:21 PM ISTకింగ్ నాగార్జున కెరీర్‌లోని క్లాసిక్ చిత్రాల్లో ఒకటైన 'మన్మథుడు' సినిమాను, అందులోని హీరోయిన్ అన్షును తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. తన అమాయకమైన చూపులతో, అందమైన నవ్వుతో మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా మళ్లీ అభిమానులకు టచ్‌లోకి వచ్చింది.
లేటెస్ట్ గా ఆమె షేర్ చేసుకున్న ఫొటోలు ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు చీరలో, ట్రెడిషనల్ సిల్వర్ జ్యువెలరీతో అచ్చం దేవకన్యలా మెరిసిపోతోంది. ఈ ఫొటోలలో ఆమె అందం, గ్రేస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'మన్మథుడు'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అన్షు, ఆ తర్వాత ప్రభాస్ సరసన 'రాఘవేంద్ర' సినిమాలో మెరిసింది.
కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలోనే వ్యక్తిగత కారణాలతో ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో చాలామంది అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, చాలా ఏళ్ల విరామం తర్వాత సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చి తన ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ, తన ఫ్యామిలీ విషయాలతో పాటు, అదిరిపోయే ఫొటోషూట్లతో అలరిస్తోంది. వయసు 40 ఏళ్ళు దాటినా కూడా ఆమె అందంతో నేటితరం హీరోయిన్స్ పోటీని ఇచ్చేలా ఉన్నట్లు అర్థమవుతుంది.
ఇక రీసెంట్ గా సందీప్ కిషన్ హీరోగా చేసిన మజాకా సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ బిజీ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా, ఇండస్ట్రీకి దూరమై ఇన్నేళ్లయినా అన్షులో అందం, ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదని ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికీ అదే గ్రేస్‌తో, అందంతో సోషల్ మీడియాలో తన క్రేజ్‌ను నిలబెట్టుకుంటోంది.
