Begin typing your search above and press return to search.

39లోనూ తరగని అందం.. 'మన్మథుడు' బ్యూటీ గ్లామర్ ట్రీట్!

'మన్మథుడు' సినిమాలో నాగార్జున సరసన మహేశ్వరిగా నటించి, తన క్యూట్ లుక్స్​తో తెలుగు ప్రేక్షకులను మాయ చేశారు అన్షు అంబానీ.

By:  M Prashanth   |   24 Nov 2025 12:42 AM IST
39లోనూ తరగని అందం.. మన్మథుడు బ్యూటీ గ్లామర్ ట్రీట్!
X

'మన్మథుడు' సినిమాలో నాగార్జున సరసన మహేశ్వరిగా నటించి, తన క్యూట్ లుక్స్​తో తెలుగు ప్రేక్షకులను మాయ చేశారు అన్షు అంబానీ. ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్​లో చెరగని ముద్ర వేసుకున్నారు. తన అమాయకమైన నవ్వు, అభినయంతో కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టారు.





ఇక లేటెస్ట్ గా అన్షు షేర్ చేసిన ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ, ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. లేత పసుపు రంగు డిజైనర్ శారీలో, స్ట్రాప్​లెస్ బ్లౌజ్ ధరించి ఎంతో గ్లామరస్​గా, అదే సమయంలో క్యూట్​గా కనిపిస్తున్నారు. ఆమె గ్రేస్ చూస్తుంటే వయసు జస్ట్ ఒక నెంబర్ అనిపిస్తోంది.





'మన్మథుడు' తర్వాత ప్రభాస్ సరసన 'రాఘవేంద్ర' చిత్రంలో మెరిశారు. కెరీర్ మంచి పీక్ స్టేజ్​లో ఉన్నప్పుడే వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరమయ్యారు. లండన్​లో స్థిరపడి, ఫ్యాషన్ డిజైనర్​గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలైనా ఆమెలోని ఆకర్షణ మాత్రం అలాగే ఉండటం విశేషం.





ఇటీవల అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్​కు ఎప్పుడూ దగ్గరగానే ఉంటున్నారు. తన ఫ్యాషన్ లేబుల్​కు సంబంధించిన డిజైన్స్​తో పాటు, అప్పుడప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ ఫొటోషూట్స్ పోస్ట్ చేస్తూ అలరిస్తున్నారు. ఆమె మళ్ళీ స్పెషల్ రోల్స్ చేస్తే బాగుంటుందని చాలా మంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.





సాధారణంగా హీరోయిన్లు సినిమాలకు దూరమైతే గ్లామర్ తగ్గుతుంది, కానీ అన్షు విషయంలో అది రివర్స్ అయింది. 39 ఏళ్లలోనూ 20 ఏళ్ల అమ్మాయిలా మెరిసిపోతూ, నేటితరం హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ లేటెస్ట్ పిక్స్ చూస్తుంటే ఆమె మళ్లీ వెండితెరపై హీరోయిన్ గా చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు.