Begin typing your search above and press return to search.

అక్కినేని హీరోలంద‌రి ఫోన్ల‌ల‌లో ఏఎన్నారే!

ఏఎన్నార్ భౌతికంగా లేక‌పోయినా? అభిమానుల గుండెల్లో, ఆ కుటుంబంలో ఎప్ప‌టికీ స‌జీవంగానే ఉంటారు.

By:  Srikanth Kontham   |   20 Jan 2026 9:42 AM IST
అక్కినేని హీరోలంద‌రి ఫోన్ల‌ల‌లో ఏఎన్నారే!
X

ఏఎన్నార్ భౌతికంగా లేక‌పోయినా? అభిమానుల గుండెల్లో, ఆ కుటుంబంలో ఎప్ప‌టికీ స‌జీవంగానే ఉంటారు. నిరంత‌రం ఏఎన్నార్ ను ఏదో రూపంలో త‌లుచుకుంటూనే ఉంటారు. ఏఎన్నార్ లివ్స్ ఆన్ అంటూ అక్కినేని కాంపౌండ్ లో ఎప్పుడూ కనిపిస్తుంది. ఏఎన్నార్ పేరు లేకుండా అక్క‌డ ఏప‌ని మొద‌లు పెట్ట‌రు. ముఖ్యంగా నాగార్జున తండ్రిని త‌లుచుకోని రోజు అంటూ ఉండ‌దు. ఏఎన్నార్ పేరిట ఏటా ఎన్నో కార్య‌క్ర‌మాలు నిర్వ హిస్తుంటారు. ప్ర‌తీ ఏటా ఏఎన్నార్ అవార్డు కార్య‌క్ర‌మాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తుంటారు. ఆ స‌మ‌యంలో తండ్రి గురించి నాగార్జున ఎన్నో జ్ఞాప‌కాలు పంచుకుంటారు.

ఆ మ‌ధుర జ్ఞాప‌కాలు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయి. తాజాగా ఏఎన్నార్ ఫోటోని మ‌న‌వ‌డు అఖిల్ ఫోన్లో హోమ్ పేజ్ గా క‌నిపించ‌డం తో తాత‌య్య‌ను అఖిల్ ఎంత‌గా ప్రేమిస్తాడు? అన్న‌ది అద్దం ప‌డుతుంది. ఇటీవ‌లే కారు ఎక్కుతోన్న స‌మ‌యంలో అఖిల్ ఫోన్లో ఉన్న తాత‌య్య ఫోటో లీక్ అవ్వ‌డంతోనే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అయితే ఇలా అఖిల్ మాత్ర‌మే కాదు మిగ‌తా అక్కినేని హీరోలంతా కూడా ఏఎన్నార్ ఫోటోని ఫోన్లో ఏదో రూపంలో సేవ్ చేసుకుని పెట్టుకుంటారు. రోజులో కొన్నిసార్లు అయినా ఆ ఫోటోను చూస్తుంటార‌ని అక్కినేని కాంపౌండ్ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.

ఏఎన్నార్ కుమారులైన వెంక‌ట్, నాగార్జున‌, మ‌న‌వ‌లు సుమంత్, సుప్రియ‌, నాగ‌చైత‌న్య‌, సుషాంత్ అంతా వారి ఫోన్ల‌ల‌లో ఏఎన్నార్ ఫోటోను హోమ్ పేజ్ , స్క్రీన్ సేవ‌ర్ గా సేవ్ చేసుకుని ఉంటారుట‌. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఏఎన్నార్ ఓ మ‌హావృక్షం. ఆయ‌న వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకునే నాగార్జున న‌టుడ‌య్యారు. తండ్రి వార‌స త్వాన్ని కొన‌సాగిస్తున్నారు. నాగ్ వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌డానికి ముందుగా నాగ‌చైత‌న్య నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అనంత‌రం అఖిల్ కూడా హీరోగా లాంచ్ అయ్యాడు. వీళ్లిద్ద‌రి కంటే ముందే ఏఎన్నార్ కుమార్తె కొడుకైనా సుమంత్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్ల పాటు కొన‌సాగాడు.

కానీ త‌ర్వాత కాలంలో కాంపిటీష‌న్ పెర‌గ‌డంతో సుమంత్ సినిమాల‌కు దూర‌మ‌య్యాడు. అవ‌కాశం వ‌స్తే అప్పుడ‌ప్పుడు వెండి తెర‌పై క‌నిపిస్తున్నాడు. సుప్రియ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆమె న‌టిగా కొన‌సాగ‌లేదు. ప్ర‌స్తుతం స్టూడియో స‌హా నిర్మాణ వ్య‌వ‌హారాలు చూసుకుంటున్నారు. సుశాంత్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ హీరోగా నిల‌దొక్కుకోలేక‌పోయాడు. ఇత‌ర స్టార్స్ చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు స‌హా హీరో అవ‌కాశాలు వ‌స్తే వ‌ద‌లుకుండా ప‌ని చేస్తున్నాడు. పెద్ద కుమారుడు వెంక‌ట్ మాత్రం బిజినెస్ వ్య‌వ‌హారాలు చూసుకుంటున్నారు. ఈయ‌న కూడా నిర్మాత‌గా కొన్ని సినిమాల‌కు ప‌ని చేసిన వారే.