ఏఎన్నార్ బయోపిక్.. నాగార్జున కొత్త మాట..!
తెలుగు సినిమా చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోయే పేరు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అప్పటి మద్రాస్ ఇప్పటి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఏఎన్నార్ చేసిన కృషి అందరికీ తెలిసిందే.
By: Ramesh Boddu | 20 Sept 2025 11:08 AM ISTతెలుగు సినిమా చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోయే పేరు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అప్పటి మద్రాస్ ఇప్పటి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఏఎన్నార్ చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఆయన చేసిన పౌరాణిక, సాంఘిక, సోషియో ఫాంటసీ, మైథాలజీ ఇలా అన్నిటిలో ఆయన అదరగొట్టారు. తెలుగులో డాన్స్ కి క్రేజ్ తెచ్చిన స్టార్ ఆయన. ఐతే ఆయన నట వారసత్వాన్ని నాగార్జున తీసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నాగార్జున కూడా అటు అన్నపూర్ణ స్టూడియోస్ ని చూసుకుంటూ హీరోగా సక్సెస్ ఫుల్ కెరీర్ ని కొనసాగిస్తున్నారు.
ఏఎన్నార్ 101వ పుట్టినరోజు..
నేడు ఏఎన్నార్ 101వ పుట్టినరోజు.. 100వ జన్మదినం రోజు ఏఎన్నార్ విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఆవిష్కరించారు అక్కినేని ఫ్యామిలీ. ఇక నేడు అక్కినేని జయంతి నాడు మరోసారి ఆయన బయోపిక్ పై చర్చ జరుగుతుంది. ఐతే రీసెంట్ గా నాగార్జున కూడా ఏఎన్నార్ బయోపిక్ మీద డిస్కస్ చేశారు. అంతకుముందు నాగార్జున నాన్న గారి బయోపిక్ మీద అంత ఆసక్తి చూపించలేదు.
ఆయన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. నటుడిగానే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా ఆయన పరిపూర్ణత ఆస్వాదించారు. చివరి వరకు నటిస్తూనే ఉన్నారు. ఐతే ఏఎన్నార్ బయోపిక్ పై నాగార్జున మాట మారినట్టు తెలుస్తుంది. ఇదివరకు నాన్న బయోపిక్ కి ఛాన్స్ లేదన్న నాగార్జున ఇప్పుడు ఆయన కథ ఎలా చెప్పాలన్నట్టు మాట్లాడుతున్నారు.
బయోపిక్ లో ఎవరు నటిస్తారు..
సో త్వరలోనే ఏఎన్నార్ బయోపిక్ ఎనౌన్స్ మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఈ బయోపిక్ లో ఎవరు నటిస్తారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఏఎన్నార్ ఫ్యామిలీలోనే ఎవరు చేస్తారన్నది చూడాలి. తండ్రి మీద ప్రేమతో నాగార్జున ఏఎన్నార్ బయోపిక్ లో నటిస్తారన్నది ఫస్ట్ ఆప్షన్. నాగార్జున ఇలా తన సోషల్ మూవీస్ తో పాటు డివోషనల్ మూవీస్ కూడా చేశాడు. అన్నమయ్య, రామదాసు, శిరిడి సాయిగా అలరించారు.
ఏఎన్నార్ గా ఆయన మేకోవర్ అదిరిపోతుంది. ఒకవేళ నాగార్జున చేయకపోతే ఆ ఛాన్స్ సుమంత్ కి దక్కే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సుమంత్ కొన్ని యాంగిల్స్ లో ఏఎన్నార్ ని తలపిస్తాడు. రీసెంట్ గా సుమంత్ సినిమా అనగనగా ఓటీటీ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. అందులో కొన్ని షేడ్స్ లో సుమంత్ ని చూస్తే ఏఎన్నార్ గుర్తుకొస్తారు. సో ఏఎన్నార్ బయోపిక్ కన్ ఫర్మ్ అవ్వడమే కాదు అందులో ఎవరు చేస్తారన్నది కూడా సస్పెన్స్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ నాగార్జునకే ఎక్కువ శాతం ఛాన్స్ ఉంది. కానీ ఏదైనా మార్పు ఉంటుందా అన్నది చూడాలి.
