Begin typing your search above and press return to search.

51 ఏళ్ల అన్నపూర్ణ స్టూడియోస్.. నెట్టింట స్పెషల్ పిక్ వైరల్

సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడక్షన్ హౌస్ ఐదు దశాబ్దాలకు పైగా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.

By:  M Prashanth   |   13 Aug 2026 10:20 AM IST
51 ఏళ్ల అన్నపూర్ణ స్టూడియోస్.. నెట్టింట స్పెషల్ పిక్ వైరల్
X

సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడక్షన్ హౌస్ ఐదు దశాబ్దాలకు పైగా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ట్రెండ్స్ మారుతున్నా జనాల టేస్ట్ కి తగ్గట్టు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇక 51 ఏళ్లుగా ఒకే పేరు బలంగా వినిపిస్తోంది. 1975 ఆగస్టు 13న అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ కు పునాది వేశారు. ఈ ప్రయాణానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక రేర్ ఫోటో ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతోంది.

ఆ వైరల్ అవుతున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో వెనుక ఒక అందమైన జ్ఞాపకం దాగుంది. స్టూడియోకి శంకుస్థాపన చేస్తున్న టైమ్ లో తీసిన ఆ పిక్ లో ఉన్నది నాగార్జున వాళ్ల అమ్మ అన్నపూర్ణమ్మ గారు. ఆవిడతో పాటు కలిసి పునాది రాయి వేస్తున్న ఆ చిన్న పిల్లాడు మరెవరో కాదు, ఏఎన్నార్ మనవడు, హీరో సుమంత్. తన అమ్మమ్మ చేతులు పట్టుకుని సుమంత్ పునాది వేస్తున్న ఆ అరుదైన మూమెంట్ అక్కినేని ఫ్యాన్స్ కు ఒక స్వీట్ మెమరీలా అనిపిస్తోంది.

అప్పట్లో తెలుగు సినిమా షూటింగులన్నీ మద్రాస్ లోనే జరిగేవి. మనకంటూ సొంత గడ్డపై ఒక ఇండస్ట్రీ ఉండాలనే ఉద్దేశంతో ఏఎన్నార్ హైదరాబాద్ లో స్టూడియో కట్టడానికి ముందడుగు వేశారు. అప్పట్లో అదొక పెద్ద రిస్క్. ఎక్కడినుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇక్కడికి రావాలి. కానీ ఆ రిస్క్ వర్కౌట్ అయింది. టాలీవుడ్ పూర్తిగా హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడానికి ఈ స్టూడియో ఒక ప్రాక్టికల్ రీజన్ గా మారింది.

కేవలం అక్కినేని ఫ్యామిలీ హీరోలతో సినిమాలు తీసుకోవడానికే ఈ సంస్థ పరిమితం కాలేదు. బయటి హీరోలకు కొత్త కాన్సెప్టులకు కూడా స్పేస్ ఇచ్చారు. బిజినెస్ అన్నాక ఫ్లాపులు కూడా వస్తాయి. అలా దెబ్బతిన్న ప్రతిసారీ మళ్లీ కొత్త ట్రెండ్ కు తగ్గట్లు కథలు ఎంచుకుంటూ, మారుతున్న కాలానికి తగినట్లు టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ అవుతూ రావడం వల్లే ఈ బ్యానర్ రేసులో నిలబడింది.

ఒక స్టూడియో కేవలం పాత జ్ఞాపకాల మీద బతకలేదు. అందుకే ఇప్పుడు లేటెస్ట్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ల వరకు అన్నీ సెట్ చేశారు. సినిమా నిర్మాణం, ఫెసిలిటీస్ అందించడమే కాకుండా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసే విషయంలోనూ వీళ్లు ముందున్నారు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ ద్వారా ఎంతోమందికి డైరెక్షన్, యాక్టింగ్, ఎడిటింగ్ లాంటి క్రాఫ్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తూ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ ను అందిస్తున్నారు.

ఇవాళ్టితో ఈ స్టూడియో ప్రయాణం 51 ఏళ్లు పూర్తి చేసుకుంది. నెట్టింట ఏఎన్నార్ లైవ్స్ ఆన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఫ్యాన్స్ ఆ పాత రోజులను గుర్తుచేసుకుంటున్నారు. కాలానికి తగ్గట్టు అప్డేట్ అవుతున్న ఈ బ్యానర్.. రీసెంట్ గా అఖిల్ తో తీసిన 'లెనిన్' సినిమాతో ప్రొడక్షన్ పరంగా మంచి హిట్ కొట్టింది. త్వరలో 'పల్లబురుసు' సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.