Begin typing your search above and press return to search.

సుకుమార్‌ ఇంటి నుంచి మరో దర్శకుడు!

ఇప్పటి వరకు సుకుమార్‌ శిష్యులు దర్శకులుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇప్పుడు సుకుమార్‌ ఇంటి మనిషి దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది.

By:  Ramesh Palla   |   8 July 2026 12:35 PM IST
సుకుమార్‌ ఇంటి నుంచి మరో దర్శకుడు!
X

టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు సుకుమార్‌ ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులను అందించిన విషయం తెల్సిందే. సుకుమార్‌ వద్ద శిష్యులుగా చేసిన వారిలో చాలా మంది దర్శకత్వం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు ఏకంగా రామ్‌ చరణ్‌తో పెద్ది సినిమా చేసి గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న విషయం తెల్సిందే. బుచ్చిబాబు మాత్రమే కాకుండా పలువురు సుకుమార్‌ శిష్యులు ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. యంగ్‌ హీరోల్లో చాలా మంది సుకుమార్‌ శిష్యులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సుకుమార్‌తో చేయలేక పోయినా ఆయన శిష్యులతో సినిమాలు చేయాలని కోరుకునే యంగ్‌ హీరోలు చాలా మందే ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుకుమార్‌ కాంపౌండ్‌ నుంచి మరో దర్శకుడు టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నాడు.

సుకుమార్‌ శిష్యులు వరుసగా దర్శకులుగా...

ఇప్పటి వరకు సుకుమార్‌ శిష్యులు దర్శకులుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇప్పుడు సుకుమార్‌ ఇంటి మనిషి దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌ సోదరుడి కొడుకు బాబీని దర్శకుడిగా పరిచయం చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత కొంత కాలంగా సుకుమార్‌ వద్ద బాబీ శిష్యుడిగా ఉన్నాడు. సుకుమార్‌ సినిమాలతో పాటు, పలు ప్రాజెక్ట్‌లకు అసోషియేట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు సొంతంగా సినిమాను చేసేందుకు బాబీ రెడీ అయ్యాడు. సుకుమార్‌ కాంపౌండ్‌ నుంచి వచ్చే దర్శకులు అంతా కూడా మొదట సుకుమార్‌ రైటింగ్స్ బ్యానర్‌లోనే సినిమాను చేయడం మనం చూస్తూ ఉన్నాం. బాబీ మొదటి సినిమా సైతం సుకుమార్‌ సొంత బ్యానర్‌లో రూపొందబోతున్నట్లు సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా బాబీ దర్శకత్వంలో...

బాబీ దర్శకుడిగా పరిచయం కాబోతున్న సినిమా స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయిందని తెలుస్తుంది. సుకుమార్‌ సూచనతో ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డకు బాబీ కథ చెప్పడం, ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిందట. సిద్దు జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలను చేస్తున్నప్పటికీ సుకుమార్‌ శిష్యుడు కావడంతో బాబీ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమాను సుకుమార్‌ స్వయంగా నిర్మిస్తున్న కారణంగా సిద్దు కాదనలేక పోయి ఉంటాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో సుకుమార్‌ శిష్యులకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్ కారణంగా మొదటి నుంచే సిద్దు జొన్నలగడ్డ నటించబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

సుకుమార్‌ బ్యానర్‌లో కొత్త సినిమా..

సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తర్వాత మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్‌ ఇప్పటికే రామ్‌ చరణ్‌ మూవీని ప్రకటించాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ ఇవ్వనున్నాడు. అయితే సుకుమార్‌ కాస్త గ్యాప్‌ తీసుకుంటున్న మాట వాస్తవం అని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఈ గ్యాప్‌లో బాబీ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో సుకుమార్‌ పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సుకుమార్‌ హ్యాండ్‌ పడితే కచ్చితంగా మంచి ఔట్‌ పుట్‌ రావడం ఖాయం. తన ఇంటి కుర్రాడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో సుకుమార్‌ లైట్‌ తీసుకోకుండా నిర్మాణం మాత్రమే కాకుండా మేకింగ్‌ విషయంలోనూ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సిద్దు, బాబీ కాంబో మూవీ పట్టాలెక్కేది ఎప్పుడు అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.