మూడోసారి తల్లి అయిన నటి.. మామ్ అయితేనే క్రేజ్ ఎక్కువా?
హాలీవుడ్ నటి అన్నే హాథవే మూడోసారి తల్లి అయ్యారు. భర్త ఆడం షుల్మాన్‌తో కలిసి మూడో బిడ్డకు స్వాగతం పలికారు. కెల్లీ కుయోకో, మేఘన్ ట్రైనర్, సోఫియా రిచీ, కామెరూన్ డియాజ్ వంటి ప్రముఖులు కూడా ఇటీవల మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. పెళ్లి, పిల్లల తర్వాత కూడా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ తమ క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు.
By: Sivaji Kontham | 18 Nov 2026 11:13 AM ISTపెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా గ్లామర్ రంగంలో నటీమణులకు మునుపటి క్రేజ్ ఉంటుందా? అంటే.. ఎందుకు ఉండదు? హాలీవుడ్, బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంది. నటీమణులకు రూల్స్ లేవు... వయసుతో సంబంధం లేదు... పైగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న తర్వాత కూడా వారి ప్రతిభకు తగ్గ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దానికి ఎందరో నటీమణులు ఉదాహరణలుగా నిలుస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ హాలీవుడ్ ప్రముఖ నటి అన్నే హాథవే లేటు వయసులో మూడోసారి తల్లి అయ్యారు. అయినా తనకు ఎక్కడా క్రేజ్ తగ్గలేదు.
అన్నా హతవే తన భర్త ఆడం షుల్మాన్‌తో కలిసి ఆమె మూడో బిడ్డకు స్వాగతం పలికినట్లు ప్రముఖ మీడియా సంస్థలు తాజాగా వెల్లడించాయి. ఈ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమారులు జొనాథన్ - 10, జాక్ - 6 ఉండగా, తాజాగా వారి కుటుంబంలోకి మూడో చిన్నారి చేరడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత ఏడాది జూన్ 19న తన ఇన్‌స్టా వేదికగా బేబీ బంప్‌తో ఉన్న ఒక అందమైన వీడియోను షేర్ చేస్తూ ఈ గుడ్ నూస్ను అభిమానులకు చెప్పారు అన్నే.
ఈ ప్రెగ్నెన్సీ తనకూ- తన భర్తకూ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నే హాథవే సరదాగా వ్యాఖ్యానించారు. పాపులర్ టాక్ షో అయిన `ది లేట్ నైట్ విత్ సేత్ మేయర్స్` షోలో ఆమె మాట్లాడుతూ.. ఈ వయసులో మళ్లీ తల్లి కావడం ఊహించని పరిణామమని.. అందుకే తమ మూడో సంతానాన్ని ప్రేమగా బజ్జర్-బీటర్ అని పిలుచుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. తాను నటించిన `ది డెవిల్ వేర్స్ ప్రాడా 2` సినిమా ప్రమోషన్స్ సమయంలో అందరి దృష్టి సినిమాపైనే ఉండాలనే ఉద్దేశంతో ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలం పాటు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారట.
హాలీవుడ్లో గత కొన్ని నెలలుగా పలువురు ప్రముఖ నటీమణులు కూడా మామ్ లుగా మారి తమ కుటుంబాల్లో కొత్త ఆనందాలను ఆహ్వానించారు. `ది బిగ్ బ్యాంగ్ థియరీ` ఫేమ్ నటి కెల్లీ కుయోకో తన భాగస్వామి టామ్ పెల్ఫ్రితో కలిసి రెండవ సంతానంగా పాపకు జన్మనిచ్చారు. వీరికి ఇప్పటికే మటిల్డా అనే కూతురు ఉన్నారు. అదేవిధంగా.. ప్రముఖ పాప్ సింగర్ మేఘన్ ట్రైనర్ సరోగసి ద్వారా తన మూడో సంతానాన్ని స్వాగతించగా.. ప్రముఖ మోడల్ సోఫియా రిచీ కూడా తన భర్త ఎలియట్ గ్రేంజ్తో కలిసి రెండవ బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్నారు.
మరో ప్రముఖ నటి కామెరూన్ డియాజ్ - బెన్జీ మాడెన్ దంపతులు తమ మూడో సంతానంగా ఒక బాబు నాటాస్ మాడెన్ కు స్వాగతం పలికారు. వీరికి ఇప్పటికే రాడిక్స్, కార్డినల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇలా హాలీవుడ్లో వరుసగా ప్రముఖ సెలబ్రిటీలు తమ కుటుంబాలను మరింత పెద్దది చేసుకుంటూ.. తమ వ్యక్తిగత జీవితంలోని మధురమైన క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తమ కుటుంబ జీవితానికి, పిల్లల పెంపకానికి ఈ స్టార్స్ ఇస్తున్న ప్రాధాన్యత ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. యాన్ హాథవేతో పాటు మిగతా నటీమణుల మాతృత్వ ప్రయాణంపై హాలీవుడ్ వర్గాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి.
